Sunny Leone : ఈ ఫోటో ఉన్న అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్… ఆమె పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి…

Sunny Leone మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా, మంచు మనోజ్ తో కరెంటు తీగ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Written By: NARESH, Updated On : June 20, 2024 8:15 pm

Sunny Leone

Follow us on

Sunny Leone : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా రాణించాలనే ఉద్దేశ్యం తో ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ లక్కుని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక అందులో భాగంగానే కొంతమంది సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ముంబై బ్యూటీ లు గాని, మలయాళం ముద్దుగుమ్మలు గానీ, కన్నడ హీరోయిన్లు గానీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వాళ్లే ఇక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్నారు.

అయితే ఇది మొన్నటి వరకు కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్పాన్ అనేది పెరిగింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హాలీవుడ్ భామలు సైతం నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పైన ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. అది ఆమె చిన్నప్పటి ఫోటో ఇక తెలుగులో ఆమె ఎక్కువ సినిమాలు చేయనప్పటికీ చాలా సెలెక్టెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇంతకు ఆమె ఎవరు అంటే హాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్.. అయితే ఈమె తెలుగు లో అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక ఈమె చేసే సేవా కార్యక్రమాలతో కూడా తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఇక మొదట్లో ఆమె పోర్న్ స్టార్ గా గుర్తింపు పొందినప్పటికి ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆమె పుట్టినరోజు నాడు తెలుగులో ఉన్న ఆమె ఫాన్స్ కూడా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అంటే ఆమె ప్రేక్షకుల్లో ఎంతటి గుర్తింపు ను సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.

మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా, మంచు మనోజ్ తో కరెంటు తీగ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలైతే రావడం లేదు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు చేస్తూ తను బిజీగా ముందుకు సాగిస్తుంది…