Tollywood Heros : ఈ ముగ్గురు స్టార్ హీరోలకు స్క్రిప్ట్ సెలక్షన్ రాదా..? ఎప్పుడు అవే తప్పులు చేస్తున్నారు…

Tollywood Heros ఇక మీదట అయిన ఈ ముగ్గురు స్క్రిప్ట్ సెలక్షన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మంచి సక్సెస్ లను కూడా అందుకుంటారు...

Written By: NARESH, Updated On : June 20, 2024 8:30 pm

Nagarjuna and Balakrishna

Follow us on

Tollywood Heros : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ గా నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారింది. ప్రేక్షకుడు సినిమా చూసే ధోరణి కూడా మారిపోయింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్లకు నచ్చిన సినిమాలను చూడడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది హీరోలు వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం అవే రొటీన్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో ముఖ్యంగా ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం రోటీన్ ఫార్మాట్లోనే సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ఇక మొదటగా రవితేజ గురించి చూసుకుంటే అప్పుడెప్పుడో వచ్చిన డాన్ శీను సినిమా నుంచి మొన్న వచ్చిన ఈగల్ సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా రొటీన్ రొట్ట ఫార్ములానే ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు విజయాలను సాధించినప్పటికీ సగటు ప్రేక్షకులను మాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

నాగార్జున
నాగార్జున కూడా గత కొన్ని రోజుల నుంచి వరుసగా రొటీన్ ఫార్మాట్లోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ కూడా లేదని చెప్పాలి. నాగార్జున ఎప్పుడు ఎక్స్పరిమెంట్ సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నానని చెబుతున్నప్పటికీ ఈ మధ్య కాలం లో మాత్రం ఆయన సరైన సినిమాలు చేయలేకపోతున్నాడు…

బాలయ్య
బాలయ్య బాబు కూడా వరుసగా సక్సెస్ లను అందుకుంటున్నప్పటికీ ఆయన సినిమాలు తన ఫ్యాన్స్ ని మాత్రమే ఆకర్షిస్తున్నాయి. ఇక మిగతా ప్రేక్షకులు మాత్రం ఆయన సినిమాలంటేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి వైవిద్య భరితమైన సినిమాలను చేసిన ఆయన ఇప్పుడు మాత్రం కమర్షియల్ సినిమాలకే పరిమితమవ్వడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…

ఇక మీదట అయిన ఈ ముగ్గురు స్క్రిప్ట్ సెలక్షన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు కూడా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మంచి సక్సెస్ లను కూడా అందుకుంటారు…