https://oktelugu.com/

Photo Story: సావిత్రి తో ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు లోక నాయకుడు.. గుర్తుపట్టండి…

తమిళంలో అయితే జెమినీ గణేషన్ లాంటి స్టార్ హీరో తో చాలా ఎక్కువ సినిమాల్లో నటించి అలనాటి మేటి నటి గా గుర్తింపును సంపాదించుకుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న స్టార్ యాక్టర్స్ అందరికీ మహానటి సావిత్రి గారితో నటించే అవకాశం మనకు రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 20, 2024 / 06:52 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సినిమా ఇండస్ట్రీలో మహానటి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటి ‘సావిత్రి ‘..ఆమె పోషించని పాత్ర లేదు. ఒక పాత్రలో సావిత్రి నటిస్తుంది అంటే ఆ పాత్రకి జీవం వచ్చినట్టే అని భావించేవారు. ఆమె కోసమే థియేటర్ కి వచ్చి జనాలు సినిమాలను చూసేవారు అంటే ప్రేక్షకుల్లో ఆమె ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి దిగ్గజ నటులతో పోటీపడి నటించి చాలా అవార్డులను కూడా అందుకుంది.

    ఇక తమిళంలో అయితే జెమినీ గణేషన్ లాంటి స్టార్ హీరో తో చాలా ఎక్కువ సినిమాల్లో నటించి అలనాటి మేటి నటి గా గుర్తింపును సంపాదించుకుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడున్న స్టార్ యాక్టర్స్ అందరికీ మహానటి సావిత్రి గారితో నటించే అవకాశం మనకు రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న వాళ్లలో హీరోలలో ఒక్కరు మాత్రం ఆమెతో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఇక ఆ పైన కనిపిస్తున్న ఫోటో కూడా తనదే కావడం విశేషం.ఇంతకీ ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.?లోక నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు..ఇంకా గుర్తుపట్టలేదా ఆయనే మన కమలహాసన్…

    ఆయన ఒక్కడికే ‘మహానటి సావిత్రి’ గారితో నటించే అవకాశం దక్కింది. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే సావిత్రి గారితో పలు సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదట 1960 లో ‘కళత్తూర్ కన్నమ్మ’ అనే తమిళ్ సినిమాలో మొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే ఈ సినిమాలో సావిత్రి, జెమినీ గణేషన్ లా కొడుకుగా వాళ్ళతో పాటు పోటీపడి మరి నటించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు…

    ఇక 1962 లో ‘పార్థాల్ పసి తీరుం’ ( ఒక్క చూపు ఆకలిని తీరుస్తుంది) అనే సినిమాలో కూడా నటించి మెప్పించాడు. ఇక 1979 లో ‘అల్లావుద్దీన్ అద్భుద విలక్కుమ్’ అనే సినిమాలో కమలహాసన్ పెద్దాడు అయిపోయాక తను మెయిన్ లీడ్ లో నటిస్తే అందులో సావిత్రి ఒక చిన్న పాత్ర లో నటించింది. అయితే అప్పటివరకు సావిత్రి క్రేజ్ అనేది తగ్గిపోవడంతో తను ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది…