Twitter Elon Musk Deal: ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికీ అంతుబట్టని ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవల ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ట్విట్టర్ ను హస్తగతం చేసుకోవడమే మిగిలింది అనుకుంటున్న టైంలో తాజాగా ఎలాన్ మస్క్ మరో షాకిచ్చాడు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ కు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలుకు జరిగిన 44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. విలీన ఒప్పందంలో భాగంగా ఫేక్ అకౌంట్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందించడంలో ట్విట్టర్ విఫలమైందని ఎలన్ మస్క్ ఆరోపించారు.
ట్విట్టర్ వ్యాపార కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పెర్ఫామెన్స్ దీంతోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. డీల్ పూర్తి కావాలంటే ఈ సమాచారం తప్పనిసరి అని ఈ విషయంలో ట్విట్టర్ విఫలమైందునా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎలన్ మస్క్ తో ఒప్పందంలో ట్విట్టర్ పలు నిబంధనలు ఉల్లంఘిస్తోంది. ఈ డీల్ లోకి ప్రవేశించేటప్పుడు ఎలన్ మస్క్ ఏ అంశాలపై ఎలన్ మస్క్ ఏ అంశాలపై ఆధారపడ్డారో.. వాటి విషయంలో ట్విట్టర్ తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.
స్పామ్ లేదా ఫేక్ అకౌంట్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని పలుమార్లు చేసిన అభ్యర్థనలను ట్విట్టర్ పట్టించుకోలేదని మస్క్ తరుఫున న్యాయవాది మైక్ రింగ్లర్ ఆరోపించారు.
ఇక తమతో డీల్ క్యాన్సిల్ పై ట్విట్టర్ సైతం స్పందించింది. ఎలన్ మస్క్ ప్రకటనపై స్పందించిన ట్విట్టర్ బోర్డు చైర్మన్ బ్రెట్ టేలర్ మండిపడ్డారు. ఒప్పందం మేరకు వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై డెలావర్ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కోర్టుకు ఎక్కి నెలల తరబడి వేచి చూసే కన్నా రాజీకీ వచ్చే అవకాశం ఉండొచ్చునని కార్పొరేట్ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నట్టు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. స్పామ్, నకిలీ ఖాతాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికి కన్నా 5శాతం కంటే తక్కువ యూజర్లను ట్విట్టర్ సూచిస్తోందని.. ట్వీట్టర్ యూజర్ల లెక్కకు మద్దతునిచ్చే వివరాలు పెండింగ్ లో ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం విశేషం. అందుకే స్పామ్ బాట్స్ ను తొలగించడమే తన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్ తో ట్విట్టర్ షేర్లు 20శాతం పతనం అయ్యాయి. దీనిపై ట్విట్టర్ మాత్రం స్పందించాల్సి ఉంది. ఎలాన్ మస్క్ తో ఒప్పందం ముగిసే వరకూ ప్రకటనదారులు ట్విట్టర్ లో ప్రకటనలు కొనసాగించాలా? వద్దా? అనే దానితో సహా ఇతర రిస్కులు ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
[…] […]
[…] […]