Rakhi Sawant Divorce: తన ఏడేళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోతున్నట్లు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వెల్లడించింది. గతేడాది బిగ్‌బాస్ షో వేదికగా తన భర్త రితేష్ సింగ్‌ను అందరికీ పరిచయం చేసిన ఆమె.. విడిపోవడంపై వాలంటైన్స్ డే ముందు ప్రకటించడం బాధగా ఉందంది. ‘బిగ్‌బాస్ షో తర్వాత మా మధ్య విభేదాలు వచ్చాయి. కలిసి జీవించే ప్రయత్నం చేశాం. కానీ విడిపోవడమే ఉత్తమ నిర్ణయమని అనిపించింది. రితేష్ మంచి వాడు’ అని రాఖీ ఓ ప్రకటన విడుదల చేసింది.

నిజానికి సరోగసీ విధానంలో తనకు బిడ్డను కనాలని ఉందని.. ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించింది ఈ హాట్ బ్యూటీ. ఆ తర్వాత బిడ్డ విషయంలో ఈ హాట్ జంట మొత్తానికి సైలెంట్ అయ్యారు. మధ్యలో ట్రోల్స్ రాయుళ్లు ఈ భామ పై యుద్దానికి దిగినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు రాఖీ సావంత్. అయితే, ఇక రాఖీ సావంత్ కి ముంబైలో కోట్లల్లో ఆస్తులున్న సంగతి తెలిసిందే.
Also Read: ముద్దు సీన్లు కూడా పెట్టాం: మోహన్ బాబు
ముఖ్యంగా ముంబై, గోవాలో విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఓ బిజినెస్ మెన్ తో గోవాలో ఓ విలువైన విల్లాను కొనుక్కుంది. అయితే, గత ఏడాది ఆస్తులు అన్ని అమ్మేసుకుంది. ఈ క్రమంలో తన భర్త ఆమెను డబ్బు విషయంలో మోసం చేశాడు అని అందుకే.. ఇక నుంచి తాను తన భర్తకు దూరం కావాలని నిర్ణయించుకుందట.
మొత్తమ్మీద ఏడేళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోతున్నట్లు ఈ బాలీవుడ్ నటి రాఖీ వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి గతేడాది బిగ్‌బాస్ షో వేదికగా తన భర్త రితేష్ సింగ్‌ను అందరికీ పరిచయం చేసింది రాఖీ. అప్పటి వరకూ భర్త గురించి పెద్దగా ఎవరికీ చెప్పేది కాదు. ఇక ఆమె తన భర్తతో విడిపోవడంపై వాలంటైన్స్ డే ముందు ప్రకటించడం చాలా బాధగా ఉంది అంటూ ఆమె అభిమానులు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు.
Also Read: తరుణ్ సునామీలో కొట్టుకుపోయిన మహేష్ బాబు సినిమా ఎదో తెలుసా ?
[…] Also Read: వాలంటైన్స్ డే రోజున భర్తతో విడిపోయిన… […]