Kalavathi Song: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ఈ రోజు రిలీజ్ కావాలి. ఈ క్రమలో ఈ పాట ప్రొమో కూడా విడుదల అయ్యింది కూడా. అయితే ఈ రోజు రిలీజ్ కావాల్సిన ఈ పాట మొన్నే సోషల్ మీడియాలో లీకైంది. సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కావడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి విడుదలైన ఈ ‘కళావతి’ లిరికల్ సాంగ్ ప్రస్తుతం అదరగొడుతోంది. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 70 లక్షలకు పైగా వ్యూస్, 500Kకు పైగా లైకులను సంపాదించింది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి మహేష్‌బాబు నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.
Also Read: Tarun-Mahesh Babu: తరుణ్ సునామీలో కొట్టుకుపోయిన మహేష్ బాబు సినిమా ఎదో తెలుసా ?
మొత్తానికి ఈ పాటకు పైరసీ బెడద గట్టిగానే తగిలినా ఈ పాట మాత్రం ఓ ఊపు ఊపేస్తోంది. నిజానికి ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఇలా కాపీకి గురి కావడం బాధాకరమైన విషయం. ఇక చంద్రబోస్ రాసిన ఈ లవ్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.
త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేస్తారట. ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Also Read: Mahesh Babu Rejected Movies: మహేశ్ బాబు వద్దన్న 13 సినిమాలు ఇవే.. అన్నీ సూపర్ హిట్..!
[…] Also Read: మహేష్ తో కలిసి దుమ్మురేపుతున్న కళావత… […]
[…] Also Read: మహేష్ తో కలిసి దుమ్మురేపుతున్న కళావత… […]