https://oktelugu.com/

Jr NTR and Koratala Siva: ఎన్టీఆర్ ఇంటి పక్కనే సెట్.. ఇంతకీ ఆ హిందీ హీరో ఎవరు ?

Jr NTR and Koratala Siva: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారని, పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఆ సెట్ నిర్మిస్తున్నారని.. సినిమాలో ఎక్కువ భాగం ఈ […]

Written By:
  • admin
  • , Updated On : September 22, 2021 / 01:19 PM IST
    Follow us on

    Jr NTR and Koratala Siva: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారని, పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఆ సెట్ నిర్మిస్తున్నారని.. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందని.. కాబట్టి ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

    కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. హిందీలో సినిమాకి మంచి మార్కెట్ అవుతుందని కొరటాల ఫీల్ అవుతున్నాడు. మరి హిందీలో ఏ హీరో ఒప్పుకుంటాడో చూడాలి.

    ఇక, ఈ సినిమాలో విలన్ కి రైట్ హ్యాండ్ లా తమిళ హీరో అథర్వ మురళీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అథర్వ పాత్ర వెరీ వైలెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. తనదైన సినిమాలతో తమిళంలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అథర్వ, మరి ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.

    అథర్వ గతంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాలో నటించాడు. కొంతకాలం తమిళంలో హీరోగా సెటిల్ అవ్వడానికి నానా పాట్లు పడుతున్నాడు. ఇక కొరటాల ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశారని టాక్. అన్నట్టు ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.