https://oktelugu.com/

Amala Paul: హా నిజమే.. అవి కనిపిస్తున్నాయి. ఐతే ఏంటి

Amala Paul: డస్కీ భామ అమలాపాల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. అలాగే బోల్డ్ గా నటిస్తుంది కూడా. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ అమలాపాల్ చాలా ఓపెన్ గా ఉంటుంది. తన వైఖరి మొహమాటం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి విషయాన్ని అయినా సంకోచం లేకుండా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది. అయితే, ఈ మధ్య అమలాపాల్ కొన్ని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఒక […]

Written By: , Updated On : September 22, 2021 / 01:06 PM IST
Follow us on

Amala Paul: డస్కీ భామ అమలాపాల్ చాలా బోల్డ్ గా ఉంటుంది. అలాగే బోల్డ్ గా నటిస్తుంది కూడా. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ అమలాపాల్ చాలా ఓపెన్ గా ఉంటుంది. తన వైఖరి మొహమాటం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి విషయాన్ని అయినా సంకోచం లేకుండా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది. అయితే, ఈ మధ్య అమలాపాల్ కొన్ని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Amala Paul

ఆ వీడియోలో ఆమె ఒక పార్టీలో పాల్గొని మైమరచిపోయి ఫుల్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియోని కాస్త తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన కొందరు ఆకతాయి నెటిజన్లు అభ్యంతకరంగా కామెంట్స్ పోస్ట్ చేశారు. ‘అవి కనపడుతున్నాయి…’ అంటూ ఒకడు సభ్యసమాజం తలదించుకునేలా ఒక కామెంట్ పెట్టాడు.

నిజానికి ప్రతి హీరోయిన్ కి ఇలాంటి మెసేజ్ లు సర్వసాధారణం, అందుకే ఏ హీరోయిన్ ఇలాంటి మెసేజ్ ల పై స్పందించడానికి ఇష్టపడరు. చూసీ, చూడనట్లు వదిలేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది అమలాపాల్ కదా.. ఆ బోల్డ్ కామెంట్స్ కి అంతే బోల్డ్ గా సమాధానం చెప్పింది. ‘హా నిజమే.. అవి కనిపిస్తున్నాయి. ఐతే ఏంటి ? మనం ఉన్నది 2021లో” అంటూ మొత్తానికి బోల్డ్ గా జవాబు ఇచ్చింది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అమలాపాల్ సమాధానానికి వేలల్లో లైకులు వచ్చాయి. నేటి డిజిటల్ సమాజం కూడా సనాతన భావాలను అంగీకరించేలా కనిపించడం లేదు. ఇక అమలాపాల్ కు ఈ మధ్య చెప్పుకోతగ్గ అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా వెబ్ సినిమాల్లోనే నటిస్తోంది. అవి కూడా బోల్డ్ పాత్రల్లో.