Vaccine For Children: కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి

పిల్లలలకు కొవాగ్జిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ప్రయోగాలకు సంబంధించిన డేటాను వచ్చే వారంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. పీడియాట్రిక్ కొవాగ్జిన్ రెండు, మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నారు. పడీయాట్రిక్ చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం డేటాపై […]

Written By: Velishala Suresh, Updated On : September 22, 2021 1:20 pm
Follow us on

పిల్లలలకు కొవాగ్జిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొవాగ్జిన్ టీకాపై రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ప్రయోగాలకు సంబంధించిన డేటాను వచ్చే వారంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సమర్పించే అవకాశం ఉంది.

ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. పీడియాట్రిక్ కొవాగ్జిన్ రెండు, మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నారు. పడీయాట్రిక్ చిన్నారులపై ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం డేటాపై అధ్యయనం కొనసాగుతుందని, వచ్చే వారం నివేదిక ను డీసీజీఐకి అప్పగించే అవకాశం ఉందన్నారు. అలాగే ఇంట్రానసల్ వ్యాక్సిన్ ట్రయల్స్ సైతం రెండో దశలో ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ లో పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్ ముక్కు ద్వారా ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న వైరస్ ను నాశనం చేస్తుందని తెలిపారు. టీకాను 650 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.