Bobby : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబీ లాంటి డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆయనకు సక్సెస్ రేట్ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని అయితే తెలియజేశాడు. అదేంటి అంటే ఆయన తన కథతో సినిమా చేస్తే ఈజీగా సక్సెస్ సాధిస్తున్నానని ఇతరుల కథ అయితే తను దాన్ని ఓన్ చేసుకోలేక దాన్ని ఎలా తీయాలి అనే సందిగ్ధ పరిస్థితిలో పడిపోతున్నానని చెప్పాడు. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కథ కూడా పవన్ కళ్యాణ్ గారిదే కావడం వల్ల ఆయన దాన్ని ఫుల్ ఫ్లేజ్డ్ గా తీయలేకపోయనని కూడా తెలియజేశాడు. ఇక ఆ తర్వాత తాము రాసుకున్న జై లవకుశ కథ తో సూపర్ హిట్ కొట్టనని తెలియజేశాడు. ఇక వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా వచ్చిన ‘వెంకీ మామ’ సినిమా కోసం కూడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు వేరే లాంగ్వేజ్ నుంచి ఒక లైన్ తీసుకొని కథను రెడీ చేయించి తన చేత డైరెక్షన్ చేయించాడు. అందువల్లే ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇక ఆ తర్వాత చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ కథను స్వయంగా తనే రాసుకున్నాడు. కాబట్టి ఆ సినిమా 200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సాధించింది. ఇక మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ సినిమాకి కూడా తనే కథ మాటలు దర్శకత్వం వహించడం విశేషం…
అందువల్లే ఆయన ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా తీసి ఒక సక్సెస్ అయితే అందుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే తను రాసుకున్న కథ అయితేనే తనకు డైరెక్షన్ చేయడానికి చాలా కన్వీనెంట్ గా ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది…
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.