Daku Maharaj : నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన ‘డాకు మహారాజ్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రజినీకాంత్ కి ‘జైలర్’ చిత్రం ఎలాంటిదో, ‘డాకు మహారాజ్’ బాలయ్య కి అలాంటి చిత్రమని అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించారు. తన ప్రతీ సినిమాలో భీకరమైన పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్తూ, అభిమానులను ఉర్రూతలూ ఊగించే బాలయ్య, ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్ పెర్ఫార్మన్స్ తో, ఇప్పటి వరకు తనలో అభిమానులు చూడని కొత్త కోణాన్ని పరిచయం చేసాడు. అందుకే అనకాపల్లి నుండి అమెరికా వరకు ఈ సినిమాకి ఓపెనింగ్ వసూళ్లు దద్దరిల్లాయి. ట్రేడ్ పండితులు సైతం బాలయ్య కి వచ్చిన ఈ ఓపెనింగ్ ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. సీనియర్ హీరోలలో చిరంజీవి కి కాకుండా ఆ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు ఈ చిత్రం ద్వారా బాలయ్య కి మాత్రమే వచ్చిందని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. అదే విధంగా సీడెడ్ లో కూడా ఈ చిత్రానికి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 1 మిలియన్ డాలర్స్ కి పై గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు నార్త్ అమెరికా లో ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. పాజిటివ్ మౌత్ టాక్ తో పాటు, రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా రావడంతో ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ రెండవ రోజు మాత్రం ఈ సినిమాకి వసూళ్లు భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ అంత దారుణంగా ఉన్నాయి మరి. హైదరాబాద్ మొత్తం మీద తిప్పి కొడితే ఈ చిత్రానికి 30 ఫాస్ట్ ఫిల్లింగ్ షోస్ కూడా లేవు. ఉత్తరాంధ్ర లో అయితే ‘గేమ్ చేంజర్’ ఫాస్ట్ ఫిల్లింగ్ షోస్ లో పావు శాతం కూడా ఈ చిత్రానికి లేదు. చూడాలి మరి రెండవ రోజు ముగిసే సమయానికి ఎంత వసూళ్లు వస్తాయి అనేది.