https://oktelugu.com/

సోనూ సూద్ తప్పు చేసాడంటూ పోలీస్ కేసు !

కరోనా వల్ల దేశం అల్లకల్లోలం అయినప్పటి నుండి నటుడు సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్‌లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు.సాయం కోరని వాళ్లకు అందరికీ తన వంతు సాయం చేశాడు. తాజాగా తమ పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం ఇబ్బందులు పడుతున్న […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 05:42 PM IST
    Follow us on


    కరోనా వల్ల దేశం అల్లకల్లోలం అయినప్పటి నుండి నటుడు సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్‌లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు.సాయం కోరని వాళ్లకు అందరికీ తన వంతు సాయం చేశాడు. తాజాగా తమ పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం ఇబ్బందులు పడుతున్న వంద మంది సినీ కార్మికులకు 100 స్మార్ట్ ఫోన్లు పంచిపెట్టాడు. అయితే ఈ రియల్ హీరో మీద తాజాగా ముంబైలో పోలీస్ కేసు నమోదవ్వటం తెలిసి అందరూ షాక్ అవతున్నారు.

    Also Read: ‘సలార్’ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో !

    వివరాలలోకి వెళితే… ముంబై నగరంలోని తన నివాసగృహాన్ని హోటల్‌గా మార్చినందుకు సోనూసూద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ అధికారులు ముంబై పోలీసులను కోరారు. ఈ మేర బీఎంసీ అధికారులు ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపించారు. అవసరమైన అనుమతి తీసుకోకుండా తన నివాస భవనాన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారని బీఎంసీ ఆరోపించింది. ఈ విషయంలో బీఎంసీ అధికారులు సోనూసూద్‌కు పలు నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదని, అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బీఎంసీ అధికారులు చెప్పారు.

    Also Read: హిట్ డైరెక్టర్ కి రిలీఫ్ ఇచ్చిన రవితేజ !

    దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ… తాను భవనాన్ని హోటల్ గా మార్చడానికి బీఎంసీ పర్మిషన్ తీసుకున్నానని చెప్పాడు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. అయితే.. కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్మిషన్ రావాల్సి ఉందన్నాడు. దీనికి కూడా దరఖాస్తు చేసుకున్నానని కరోనా కారణంగానే ఈ అనుమతి ఇంకా రాలేదని చెప్పాడు. ఒకవేళ అనుమతి రాకుంటే తన హోటల్ ను తీసేస్తానని ఆయన అన్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్