https://oktelugu.com/

ఫోటోగ్రాఫర్ కు వార్నింగ్ ఇచ్చిన అనుష్క శర్మ !

ఒకసారి సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత జీవితం తెరిచిన పుస్తకం అవుతుంది. మీడియా, ప్రజల కళ్లన్నీ సెలెబ్రెటీస్ మీదనే ఉంటాయి. వ్యక్తిగత జీవితం అంటూ ఉండదిక, పబ్లిక్ ప్రాపెర్టీ అనేసుకుని ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు ఏవేవో రాస్తుంటారు, చేస్తుంటారు. ఇక ఎప్పుడెప్పుడు కొత్త న్యూస్ దొరుకుతుందా దాన్ని వైరల్ చేసి రేటింగ్ పెంచేసుకుందామని చూసే మీడియా హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెలబ్రిటీల ప్రతి చర్యను కెమేరాల్లో నిక్షిప్తం చేసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుంటారు. […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 05:47 PM IST
    Follow us on


    ఒకసారి సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత జీవితం తెరిచిన పుస్తకం అవుతుంది. మీడియా, ప్రజల కళ్లన్నీ సెలెబ్రెటీస్ మీదనే ఉంటాయి. వ్యక్తిగత జీవితం అంటూ ఉండదిక, పబ్లిక్ ప్రాపెర్టీ అనేసుకుని ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు ఏవేవో రాస్తుంటారు, చేస్తుంటారు. ఇక ఎప్పుడెప్పుడు కొత్త న్యూస్ దొరుకుతుందా దాన్ని వైరల్ చేసి రేటింగ్ పెంచేసుకుందామని చూసే మీడియా హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెలబ్రిటీల ప్రతి చర్యను కెమేరాల్లో నిక్షిప్తం చేసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తుంటారు. ఈ అత్యుత్సాహం కొన్నిసార్లు సెలబ్రిటీలకు చిరాకు కలిగిస్తుంటుంది.

    Also Read: సోనూ సూద్ తప్పు చేసాడంటూ పోలీస్ కేసు !

    ఇండియా క్రికెట్ టీం కెప్టెన్, కింగ్ కోహ్లీ భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది. తన భర్త విరాట్ కోహ్లీతో బాల్కనీలో టైమ్ స్పెండ్ చేస్తుంటే..ఆ చిత్రాన్ని సీక్రెట్ గా ఫోటో తీసి అంతర్జాలంలోకి రివీల్ చేసేశారు. టాప్ సెలెబ్రిటి కపుల్ ఫోటో కావడంతో త్వరగా వైరల్ అయ్యింది. సోషల్‌ మీడియా వేదికగా సదరు ఫొటోగ్రాఫర్, మీడియా సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. `మా గోప్యతకు భంగం కలిగించొద్దని సదరు ఫొటోగ్రాఫర్, పబ్లికేషన్‌కు ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదు. ఇప్పుడే దీన్ని ఆపండి’ అని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

    Also Read: ‘సలార్’ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో !

    ప్రస్తుతం అనుష్క శర్మ తొమ్మిది నెలల గర్భంతో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితం విరాట్ మెటర్నిటీ లీవ్ తీసుకుని ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ ముగియగానే ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఇలాంటి సమయంలో భార్య తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉందామనుకునే ఈ టైమ్ లో ఇలా ఇబ్బంది పెట్టటం ఎంత మాత్రం సబబు కాదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్