https://oktelugu.com/

Pallavi Prashanth : సాయం మానేసి జల్సాలు చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్… ఒట్టు తీసి గట్టున పెట్టాడా?

ఒక పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలు, ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు. లక్షల రూపాయల సాయం చేసి చాలా రోజులు గడిచాయి. ఇంతవరకు మరొకరికి సాయం చేయలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 09:47 PM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. హౌస్ లో సత్తా చాటాడు. టాస్కుల్లో అదరగొడుతూ ఆటలో ముందుకు దూసుకెళ్లాడు. సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కాగా హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ తాను వచ్చిందే రైతుల కోసం అన్నాడు. కష్టాల్లో ఉన్న రైతులకు సాయం చేసి ఆదుకుంటాను అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు.

    తాను టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు పంచుతానని హామీ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ ఊహించని విధంగానే సీజన్ 7 విన్నర్ అయ్యాడు. కాగా రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ టైటిల్ తో పాటు పల్లవి ప్రశాంత్ కి దక్కాయి.ప్రైజ్ మనీతో ట్యాక్స్ కటింగ్స్ పోను ప్రశాంత్ చేతికి రూ. 16 లక్షలు వచ్చాయని సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంత్ ఆ రూ. 16 లక్షలు పేద రైతులకు పంచాల్సి ఉంది.

    కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం ఇచ్చిన మాటను పక్కన పెట్టాడు. సాయం విషం మరచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన గురువు శివాజీని తరచుగాకలుస్తున్నాడు . వారి సరదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అవి వైరల్ అవుతున్నాయి. సదరు వీడియోల కింద కొందరు సాయం కావాలని మెసేజ్ లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొదటి సాయం చేసిన పల్లవి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు.

    ఒక పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలు, ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు. లక్షల రూపాయల సాయం చేసి చాలా రోజులు గడిచాయి. ఇంతవరకు మరొకరికి సాయం చేయలేదు. పైగా సహాయం కోసం ఇంటికి రావద్దని .. నేను మా టీం ఎవరికి అవసరమో గుర్తించి హెల్ప్ చేస్తాను అంటూ గతంలో పల్లవి ప్రశాంత్ కామెంట్స్ చేశాడు. ఇంకొకరికి సహాయం చేస్తాడో లేక ఆ లక్ష తోనే సరిపెట్టేస్తాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.