https://oktelugu.com/

OTT Release Movies : సమ్మర్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్.. మంజుమ్మెల్ బాయ్స్ తో పాటు ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్!

. ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఇక థ్రిల్లర్స్ ఇష్టపడే వారికైతే కొదవేలేదు. ఈ మే నెలలో అద్భుతమైన థ్రిల్లర్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి అవి ఏమిటో చూద్దాం..

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 09:40 PM IST

    OTT Release Movies

    Follow us on

    OTT Release Movies : సమ్మర్ వస్తుందంటే పలు ఓటీటీ సంస్థలు అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు తెస్తాయి. ఖాళీ సమయంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఇక థ్రిల్లర్స్ ఇష్టపడే వారికైతే కొదవేలేదు. ఈ మే నెలలో అద్భుతమైన థ్రిల్లర్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి అవి ఏమిటో చూద్దాం..

    మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్. మలయాళ పరిశ్రమను షేక్ చేసింది ఈ స్మాల్ బడ్జెట్ మూవీ. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 220 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగులో కూడా ఆదరణ దక్కించుకున్న మంజుమ్మెల్ బాయ్స్ డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. మే 5 నుండి స్ట్రీమ్ కానుంది.

    అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన థ్రిల్లర్ సిరీస్.. హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో హీరామండి మే 1 నుండి స్ట్రీమ్ కానుంది.

    ది బ్రోకెన్ న్యూస్ సీజన్ వన్ భారీ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ థ్రిల్లర్ నుండి సెకండ్ సీజన్ వచ్చేసింది. సీజన్ వన్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 2 పై అంచనాలు ఉన్నాయి. జీ 5లో మే 3 నుండి ది బ్రోకెన్ న్యూస్ స్ట్రీమ్ కానుంది. ఇక మొదటి సీజన్ చూడాలని ఉంటే జీ 5లోనే అందుబాటులో ఉంది చూడొచ్చు.

    బ్రిడ్జర్టన్ ఇంగ్లీష్ సిరీస్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికే రెండు సీజన్ స్ట్రీమ్ అయ్యింది. మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. నెట్ఫ్లిక్స్ లో బ్రిడ్జర్టన్ సీజన్ 3 మే 13 నుండి స్ట్రీమ్ కానుంది. థ్రిల్లర్స్ కి పిచ్చ కిక్ ఇచ్చే సీజన్ ఇది. వాటితో పాటు మరికొన్ని అద్భుతమైన థ్రిల్లర్స్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్నాయి.