Homeఎంటర్టైన్మెంట్Pallavi Prashanth: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్ కు రూ. 20 లక్షల ప్లాట్‌.. ఎవరిచ్చారో...

Pallavi Prashanth: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్ కు రూ. 20 లక్షల ప్లాట్‌.. ఎవరిచ్చారో తెలుసా?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు ఇదీ.. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచాడు ఈ రైతుబిడ్డ. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఇతనికి ఎక్కడికి వెళ్లినా సాదర స్వాగతం లభిస్తోంది. అభిమానులు పూలవర్షం కురిపిస్తూ రైతుబిడ్డకు అభినందిస్తున్నారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 106 రోజుల తర్వాత సోమవారం స్వగ్రామానికి చేరుకున్నాడు పల్లవి ప్రశాంత్‌. సొంత ఊళ్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తనకు గిఫ్ట్‌గా వచ్చిన కారులో స్వగ్రామానికి పయనమైన పల్లవి ప్రశాంత్‌ రోడ్డు వెంట అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. తన బిగ్‌బాస్‌ టైటిల్‌ ట్రోఫీని చూపిస్తూ సిద్దిపేట జిల్లా కోల్గురు చేరుకున్నాడు.

రూ.35 లక్షల ప్రైజ్‌ మనీ..
ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ టైటిల్‌ విజేతగా నిలవడం ద్వారా పల్లవి ప్రశాంత్‌ మొత్తం రూ. 35 లక్షల ప్రైజ్‌ మనీ సొంతం చేసుకున్నాడు. ఖరీదైన డైమండ్‌ నెక్లెస్, మారుతి బ్రీజా కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. ఇప్పుడు వీటికి అదనంగా మరో ఖరీదైన బహుమతి పల్లవి ప్రశాంత్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ తెలుగుషో విన్నర్‌గా నిలిచినందుకు ఎస్‌ఆర్కే ఇన్‌ఫ్రా డెవపర్స్‌ సంస్థ ప్రతినిధులు రైతుబిడ్డకు రూ. 20 లక్షలు విలువ చేసే ప్లాట్‌ని బహుమతిగా ప్రకటించారు.

ఈ ఖరీదైన ప్లాట్‌ ఎక్కడుందంటే..
ఎస్‌ఆర్కే ఇన్‌ఫ్రా డెవపర్స్‌ సంస్థ అందించిన ప్లాట్‌ యాదగిరిగుట్ట సమీపంలో ఉందని ప్రశాంత్‌ స్నేహితుడు తెలిపారు. దీని విలువ దాదాపు రూ.20 లక్షల వరకూ ఉంటుందని వెల్లడించాడు. రిజిస్ట్రేషన్‌ ఎప్పుడు ఏంటి? అనే వివరాలు త్వరలో చెప్తామని తెలిపారు. మారుమూల ప్రాతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలవడం గర్వంగా ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచి, స్ఫూర్తిని పంచిన పల్లవి ప్రశాంత్‌కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నుట్ల వెల్లడించారు.

ప్రశాంత్, అభిమానులపై కేసు..
ఆదివారం (డిసెంబర్‌ 17) రాత్రి బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని అభిమానులపై కేసులు నమోదయ్యాయి. షో ముగిసిన తర్వాత ప్రశాంత్, అమర్‌దీప్‌ అభిమానులు పరస్పరం గొడవకు దిగారు. దాడులకు తెగపడ్డారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. పలురురి కార్లపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుమోటోగా పల్లవి ప్రశాంత్, ఆయన అభిమానులపై కేసులు నమోదు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version