Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో టాస్కుల విషయం లో చాలా అగ్రెసివ్ గా ప్రవర్తించే కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పృథ్వీ. ఆడవాళ్ళు,మగవాళ్ళు అని తేడా లేకుండా చాలా క్రూరంగా ఆయన టాస్కులు ఆడేవాడు. అందువల్ల చాలా దెబ్బలు కూడా తగిలాయి. నాగార్జున దీనిపై చాలా సీరియస్ అయ్యి, ఇంకోసారి ఆటలు ఆడేటప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకోకపోతే ‘రెడ్ కార్డు’ ఇస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అప్పటి నుండి పృథ్వీ తనని తానూ చాలా మార్చుకున్నాడు. నాగార్జున అందుకు మెచ్చుకున్నాడు కూడా. కానీ నిన్న నిఖిల్ ఆడినంత అగ్రెసివ్ గా అయితే పృథ్వీ ఎప్పుడూ ఆడలేదు. ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఇంత ఘోరంగా ఆడిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఎవ్వరూ లేదనడంలో అతిశయోక్తి లేదు.
అసలు నిఖిల్ నిన్న యష్మీ, ప్రేరణ తో ఆడిన తీరుని పోలీసులు చూస్తే ఇతని పై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయొచ్చు. చూసేందుకు చాలా అసహ్యంగా ఉంది, ఇక ఆపేయ్ అని హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ నిఖిల్ తో చెప్తారు. కానీ నిఖిల్ ఆపడు. చివరికి ఆ ఇద్దరు అమ్మాయిలు బ్రతిమిలాడుతారు, అయినా కూడా కనికరించడు. పైగా ఆ ఇద్దరి అమ్మాయిలు ఇతనికి బాగా క్లోజ్. యష్మీ తో సీక్రెట్ లవ్ ట్రాక్ కూడా నడుపుతున్నాడు. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ మీద కోపాన్ని యష్మీ, ప్రేరణ మీద చూపించి, అత్యంత కిరాతకంగా, ఒక సైకో లాగా ప్రవర్తించాడు నిఖిల్. ఇన్ని రోజులు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలోని రేలంగి మావయ్య అంతటి మంచోడిని అని జనాలకు చూపిస్తూ వచ్చిన నిఖిల్, ఒకసారి మాస్క్ వెనుక ఉన్న ముఖాన్ని చూపించేలోపు ఆడియన్స్ ఇతనికి దండం పెట్టేస్తున్నారు. ఇన్ని రోజులు విన్నర్ మెటీరియల్ అని అనుకున్న వారికి కనువిప్పు కలిగేలా చేసాడు. అయితే ఈ ప్రవర్తనపై వీకెండ్ లో నాగార్జున సీరియస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. ముఖ్యంగా నిఖిల్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేయాలి.
మూడవ వారం లో అభయ్ బిగ్ బాస్ ని తిట్టాడని రెడ్ కార్డు చూపించి బయటకి వెళ్ళిపోమని చెప్తాడు నాగార్జున. అభయ్ చేసిన దానికి వంద రెట్లు ఎక్కువ తప్పు చేసాడు నిఖిల్. అమ్మాయిలతో అంత నీచంగా ప్రవర్తించడమే కాకుండా, గౌతమ్ పై ఉద్దేశపూర్వకంగా ఫిజికల్ కూడా అయ్యాడు. మధ్యలో అవినాష్ ఇతన్ని ఆపకపోయ్యుంటే కచ్చితంగా నిఖిల్, గౌతమ్ ని కొట్టేవాడు. వీటి అన్నిటికి నాగార్జున నిఖిల్ కి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. రెడ్ కార్డు వార్నింగ్ ఇవ్వాలి, వీకెండ్ ఎపిసోడ్ వరకు కూడా ఆగకూడదు, ఈ మధ్యలోనే నిఖిల్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేయాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ బలమైన డిమాండ్ చేస్తున్నారు. మరి నాగార్జున దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.