Bigg Boss Telugu 8: మరోసారి లేడీ టైగర్స్ అనిపించుకున్న యష్మీ, ప్రేరణ..ఒక్క ఎపిసోడ్ తో టైటిల్ రేస్ లోకి గౌతమ్!

హోస్ట్ నాగార్జున నుండి దక్కాల్సిన గుర్తింపు అయితే దక్కలేదు కానీ, ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం వీళ్లిద్దరు బలమైన ముద్ర వేసుకున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా క్రూర మృగంలా విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తించిన నిఖిల్ ని వీళ్లిద్దరు ఎదురుకున్న తీరుకి సెల్యూట్ చేయాల్సిందే.

Written By: Vicky, Updated On : October 30, 2024 9:15 am

Bigg Boss Telugu 8(177)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లేడీ టైగర్స్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ యష్మీ, ప్రేరణ. వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి కసి హౌస్ లో మరో అమ్మాయికి లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ టాస్కులోను ప్రాణం పెట్టి ఆడుతారు. ఈ టాస్క్ లో గెలవకపోతే ఇక జీవితం అయిపోయినట్టే అనే రేంజ్ లో భావిస్తారు. కొన్ని టాస్కులలో మగవాళ్ళు అతిగా ఫిజికల్ అవ్వాల్సి వస్తే, వాళ్లపై ‘వుమెన్ కార్డు’ ఉపయోగించారు. తమకి ఉన్నటువంటి ఫిజికల్ బలం తోనే పోరాడుతారు. మూడవ వారంలో వీళ్లిద్దరి ఆట బాగా హైలైట్ అయ్యింది. ఎగ్స్ టాస్క్ లో హద్దులు దాటి ఆడుతున్న పృథ్వీ తో వీళ్లిద్దరు తలపడిన తీరుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలు ఫ్యాన్స్ అయిపోయారు. ఇలాంటి అమ్మాయిలను బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారు.

హోస్ట్ నాగార్జున నుండి దక్కాల్సిన గుర్తింపు అయితే దక్కలేదు కానీ, ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం వీళ్లిద్దరు బలమైన ముద్ర వేసుకున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా క్రూర మృగంలా విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తించిన నిఖిల్ ని వీళ్లిద్దరు ఎదురుకున్న తీరుకి సెల్యూట్ చేయాల్సిందే. ఫిజికల్ గా ఎంతో బలం అది అనే అహంకారంతో, నిఖిల్ వీళ్ళిద్దరిని బొమ్మల్ని లాక్కొని వెళ్లినట్టు ఒక మూలకి లాక్కొని వెళ్లారు. కానీ అతని నుండి తప్పించుకొని తమ వాటర్ ట్యాంక్ ని కాపాడుకునేందుకు వీళ్లిద్దరు చేసిన కృషి సాధారణమైనది కాదు. నిన్న జరిగిన ఈ సంఘటన మొత్తంలో వీళ్లిద్దరి స్థానంలో వేరే అమ్మాయిలు ఉండుంటే, అమ్మాయిల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా, ఇంత ఓవర్ ఫిజికల్ అవుతావా అని ‘వుమెన్ కార్డు’ ఉపయోగించి బోలెడంత డ్రామా చేసి సానుభూతి పొందేవారు. కానీ వీళ్లిద్దరు ఆ పని చేయలేదు. తాము అసలు అమ్మాయిలు అనే విషయాన్నే మర్చిపోయారు. ఆడపులులు లాగ బరిలో నిలబడి పోరాడారు. దీనికి వీళ్లిద్దరిపై సోషల్ మీడియా అంతటా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ ఒక్క ఎపిసోడ్ తో గౌతమ్ కృష్ణ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు.

హౌస్ లోకి వచ్చిన రెండవ వారంలోనే ఓటింగ్ విషయంలో డేంజర్ జోన్ లోకి వచ్చిన గౌతమ్, నిన్నటి టాస్కు తో టైటిల్ రేస్ లోకి వచ్చేసాడు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిన్నటి టాస్క్ లో గౌతమ్ ప్రవర్తించిన తీరుని, నిఖిల్ ప్రవర్తించిన తీరుని కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించి బాగా గమనించారు. నిన్న మొన్నటి వరకు టైటిల్ రేస్ నిఖిల్, నబీల్ మధ్య ఉండేది. ఇప్పుడు నిఖిల్, గౌతమ్ మధ్య ఉండబోతుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ కొట్టబోతున్నారు. గౌతమ్ ఇంకొక్క వారం ఇదే విధంగా ఆడితే మాత్రం, ఆయనకే టైటిల్ అని ఇక ఫిక్స్ అయిపోవచ్చు, మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.