Bigg Boss Telugu 8: గౌతమ్ మీద అసూయతో క్రూర మృగంలా ప్రవర్తించిన నిఖిల్..మాస్క్ పూర్తిగా వీడిపోయిందిగా!

నిన్నటి ఎపిసోడ్ తో నిఖిల్ తన మీద ఉన్న అభిప్రాయాన్ని నాశనం చేసుకున్నాడు. ఇంత దారుణంగా, అమానుషంగా బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా ఆడలేదు అని చెప్పొచ్చు. ప్రేరణ, యష్మీ ఇద్దరు కూడా నిఖిల్ కి బాగా కావాల్సిన వాళ్ళు, కానీ ఒకరి మీద కోపాన్ని వీళ్లిద్దరి మీద చూపిస్తూ విచక్షణ కోల్పోయిన జంతువు లాగా నిఖిల్ ప్రవర్తించాడు.

Written By: Vicky, Updated On : October 30, 2024 9:24 am

Bigg Boss Telugu 8(179)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు పరంగా, ప్రవర్తన పరంగా, న్యాయకత్వ లక్షణాల పరంగా, ఇలా అన్ని విధాలుగా విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత వారం వరకు ఆయన తీరు అలాగే ఉండేది. ఆ తీరుని జనాలు నచ్చబట్టే, నిఖిల్ కి భారీ స్థాయిలో ఓట్లు వేస్తూ టాప్ 1 స్థానంలో ఉంచారు. కానీ నిన్నటి ఎపిసోడ్ తో నిఖిల్ తన మీద ఉన్న అభిప్రాయాన్ని నాశనం చేసుకున్నాడు. ఇంత దారుణంగా, అమానుషంగా బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా ఆడలేదు అని చెప్పొచ్చు. ప్రేరణ, యష్మీ ఇద్దరు కూడా నిఖిల్ కి బాగా కావాల్సిన వాళ్ళు, కానీ ఒకరి మీద కోపాన్ని వీళ్లిద్దరి మీద చూపిస్తూ విచక్షణ కోల్పోయిన జంతువు లాగా నిఖిల్ ప్రవర్తించాడు.

ఇతని అసలు రంగు ఇదేనా..?, ఇన్ని రోజులు మంచివాడిలాగా నటించాడా?, ఇతని మాజీ ప్రేమికురాలు కావ్య చెప్పిన అసలైన నిఖిల్ ఇతనేనా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ‘బిగ్ బాస్ ఇంటికి దారేది’ అనే టాస్క్ లో భాగంగా ‘పానీ పట్ యుద్ధం’ అనే లెవెల్ పెడుతాడు బిగ్ బాస్. ఈ లెవెల్ లో నాలుగు టీమ్స్ కి నాలుగు వాటర్ ట్యాంక్స్ ఇస్తాడు. ఆ నాలుగు వాటర్ ట్యాంక్స్ కి ప్లగ్స్ ఉంటాయి. అవి పీకితే నీళ్లు క్రిందకి పోతాయి. నీళ్లు క్రిందకి పోకుండా కాపాడుకోవడమే కంటెస్టెంట్స్ టాస్క్. ఈ టాస్క్ లో ప్లగ్స్ పీకోచ్చు, నీళ్లు పోయేలా వేరే ఆలోచనలు కూడా చేయొచ్చు కానీ, ఎట్టి పరిస్థితిలో ట్యాంక్స్ ని పట్టుకున్న వాళ్ళను ముట్టుకోకూడదు. కానీ గౌతమ్ హరి తేజ ని ముట్టుకుంటాడు. కానీ ఆమె వద్దు అనగానే వెంటనే ఆపేస్తాడు. దూరంగా ఉన్నటువంటి నిఖిల్, అది కరెక్ట్ కాదు అని అనగా, ట్యాంక్ ని కాపాడుతున్న వాళ్ళను ముట్టుకోకూడదు అని రూల్ బుక్ లో రాసి లేదు అని చూపిస్తాడు.

ఇక్కడ నిఖిల్ ట్రిగ్గర్ అయ్యాడు. మొదటి నుండి గౌతమ్ మీద విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు. ఈ లెవెల్ కి ముందు గౌతమ్ ని రేస్ నుండి తప్పించాల్సిందిగా యష్మీ కి చెప్తాడు. పృథ్వీ, నబీల్ తో కూడా గౌతమ్ మీద దాడి చేయండి అంటూ రెచ్చగొడుతాడు. ఇలా అతని మీద పీకల దాకా కోపం పెంచుకున్న నిఖిల్ కి, గౌతమ్ ఈ మాత్రం తప్పు చేసే ఛాన్స్ ఇవ్వడంతో ప్రేరణ, యష్మీ ని గట్టిగా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళాడు. వాళ్ళు ఇతన్ని బలవంతంగా విడిపించుకొని, ఆ క్రమంలో క్రిందపడి దెబ్బలు తగిలినా కూడా లెక్కచేయలేదు. క్రూరమైన మృగం లాగ వాళ్ళ పట్ల ప్రవర్తించాడు. చివరికి వాటర్ ట్యాంక్ ని కిక్ బాక్సింగ్ చేసి, కాళ్లతో కొట్టి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాడు నిఖిల్. దీనిపై సోషల్ మీడియా లో ఇతనిపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.