సీఎం జగన్ పై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ

ఏపీలో 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతోనే వెంటనే ఫస్ట్‌ సైన్‌ ఉచిత విద్యుత్‌ ఫైల్‌ పైనే చేశారు. అప్పట్లో విపక్షాలు వ్యతిరేకించాయి కూడా. మరోవైపు అధిష్టానం సహకరించకపోయినా అన్నింటినీ ఎదిరించి మరీ షరతుల్లేని ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు వైఎస్సార్‌‌. 2009లో ఆయన మరణం తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ అమలువుతోంది. అయితే ఒకప్పుడు షరతుల్లేకుండా వైఎస్‌ […]

Written By: NARESH, Updated On : September 22, 2020 9:59 am

jagan

Follow us on

ఏపీలో 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతోనే వెంటనే ఫస్ట్‌ సైన్‌ ఉచిత విద్యుత్‌ ఫైల్‌ పైనే చేశారు. అప్పట్లో విపక్షాలు వ్యతిరేకించాయి కూడా. మరోవైపు అధిష్టానం సహకరించకపోయినా అన్నింటినీ ఎదిరించి మరీ షరతుల్లేని ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు వైఎస్సార్‌‌.

2009లో ఆయన మరణం తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ అమలువుతోంది. అయితే ఒకప్పుడు షరతుల్లేకుండా వైఎస్‌ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ విషయంలో ఇప్పుడు కేంద్రం షరతులు పెట్టేందుకు సిద్ధమైంది. మీటర్లు బిగించేందుకు ప్లాన్‌ చేసింది. గతంలోనూ మీటర్ల బిగింపును వైఎస్సార్‌‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ.. ఇప్పుడు సీఎంగా ఉన్న వైఎస్సార్‌‌ కొడుకు జగన్‌ మాత్రం ఆ విధానాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఏపీలో ఓ వైపు విపక్షాలు వ్యతిరేకిస్తున్నా డిసెంబర్‌‌ నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా వచ్చే ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. కానీ పొరుగున ఉన్న తెలంగాణ మాత్రం ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించి రైతులకు ఉరితాడు బిగించలేమని చెబుతోంది.

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాయి. దీనిపై ఎలాంటి లెక్కలు పత్రాలు లేకపోవడంతో కేంద్రం ఈ మీటర్ల బిగింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్న రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. రైతుల కోసం విద్యుత్‌ మీటర్లు బిగించి వారిని ఇబ్బంది పెట్టలేమని తేల్చేశాయి. కానీ జగన్‌ మాత్రం దేశంలో అందరి కంటే ముందే విద్యుత్ మీటర్ల బిగింపునకు నిర్ణయం తీసుకున్నాడు. దీని వెనుక ఉన్న గుట్టును తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు తాజాగా బయటపెట్టారు.

ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెడితే కేంద్రం తెలంగాణకు రూ.3,500 కోట్లు, ఏపీకి రూ.4,000 కోట్లు ఆఫర్‌ చేసిందట. కేంద్రం ఇచ్చే రూ.3,500 కోట్లకు కక్కుర్తి పడి తాము రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని హరీష్‌ స్పష్టంగా చెప్పేశారు. జగన్‌ తీరుపైనా ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్‌ మాత్రం 4 వేల కోట్ల కోసం ఆశపడి విద్యుత్‌ మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నారని హరీష్‌ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించాలన్న జగన్‌ సర్కారు నిర్ణయం అత్యుత్సాహమే అవుతుందంటూ హరీష్‌ ఆరోపించారు.