Bigg Boss Telugu 8 : బ్రిటన్ లో రూపొందించిన డచ్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ స్పూర్తితో ఇండియాలో బిగ్ బాస్ రూపొందించారు. బిగ్ బ్రదర్ షోలో ఇండియా నుండి శిల్పా శెట్టి కంటెస్ట్ చేయడం విశేషం. ఆమె టైటిల్ విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ హిందీ సీజన్ వన్ కి ఆమె హోస్టింగ్ చేశారు. ఇక తెలుగులో 2017లో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఎన్టీఆర్ హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటికి ఈ షో పట్ల తెలుగు ఆడియన్స్ కి పెద్దగా అవగాహన లేదు. టాప్ సిల్వర్ స్క్రీన్ సెలెబ్స్ కంటెస్ట్ చేశారు.
వారందరూ ఆడియన్స్ కి బాగా తెలిసిన ముఖాలు. దానికి తోడు ఎన్టీఆర్ తన హోస్టింగ్ స్కిల్స్ తో షో సక్సెస్ చేశారు. సెకండ్ సీజన్ కి నాని చేశారు. ఆయన హోస్టింగ్ ఒకింత విమర్శల పాలైంది. దాంతో నాని తప్పుకున్నాడు. ఇక సీజన్ 3 నుండి నాగార్జున రంగంలోకి దిగాడు. లేటెస్ట్ సీజన్ తో కలిసి నాగార్జున మొత్తంగా ఆరు సీజన్స్ కి వరుసగా హోస్టింగ్ చేశాడు. నాగార్జున హోస్టింగ్ పట్ల ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన ఉంది. అయితే.. స్టార్ మాకు మరో ఆప్షన్ లేదు. స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు. ఉన్నవారు ఆసక్తి చూపడం లేదు.
సెలెబ్స్ ని ప్రపంచంతో సంబంధం లేకుండా.. నాలుగు గోడల మధ్య ఉంచి, వారి మెంటల్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కి పరీక్ష పెట్టడమే ఈ షో. వివిధ పరిస్థితుల్లో వారు స్పందించే తీరు, మాట్లాడే విధానం, నిజాయితీ, ఇతర కంటెస్టెంట్స్ తో ప్రవర్తన.. ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తారు. వారి గేమ్ ఆధారంగా ఓట్లు వేస్తారు. ప్రేక్షకులను మెప్పించినవారు మాత్రమే హౌస్ లో ఉంటారు. లేదంటే ఎలిమినేట్ అవుతారు.
ఈ రియాలిటీ షోకి నియమ నిబంధనలు ఉంటాయి. కానీ అవన్నీ బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. బిగ్ బాస్ ని ఎదిరించే , ప్రశ్నించే అధికారం కంటెస్టెంట్స్ కి లేదు. ఆయన ఇచ్చే కమాండ్స్ ని ఫాలో కావాల్సిందే. ఎదిరించిన వారికి శిక్ష ఉంటుంది. వినకపోతే బయటకు పంపించేస్తారు. చివరికి హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ ఆదేశాలను అనుసరించాలి. అయితే బిగ్ బాస్ కనిపించడు. ఆయన గంభీరమైన స్వరం మాత్రమే వినిపిస్తుంది.
అసలు బిగ్ బాస్ ఎలా ఉంటాడు? ఆయన ఎవరు? అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే బిగ్ బాస్ అనే వ్యక్తి లేడు. అది ఒక ఊహాజనిత పాత్ర. మనకు వినిపించే ఆ వాయిస్ ఒక ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఆయన పేరు శంకర్ రేణుకుంట్ల. ఈయన చాలా కాలంగా సినిమాలు, సీరియల్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నారు. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్… బిగ్ బాస్ షో డైరెక్టర్ సూచనల ఆధారంగా ఆదేశాలు ఇస్తాడు. అదన్నమాట మేటర్. v