Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు వెంకటేష్ లాంటి స్టార్ హీరో తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకోవడం కంటే ఒక నటుడిగా ఎలివేట్ చేసుకోవడానికే ఎక్కువ ప్రియార్టీ ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఇన్ని రోజుల పాటు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ సంక్రాంతికి ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు శోభన్ బాబు ఎలాగైతే ఫ్యామిలీ సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించేవాడు. ఆ తర్వాత వెంకటేష్ కూడా శోభన్ బాబు మాదిరిగానే తన సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని రప్పించి అందరికి నచ్చే ఒక ఫీల్ గుడ్ సినిమా నైతే చేసేవాడు. అందువల్ల వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తను మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే 2005వ సంవత్సరంలో సంక్రాంతి సినిమాతో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ మరోసారి 2025 వ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఆ సినిమా పోస్టర్ ను ఈ సినిమా పోస్టర్ ను కనక చూసుకున్నట్లయితే రెండు సినిమాల్లో వెంకటేష్ మాత్రం అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అసలు ఆయనకు ఏజ్ పెరిగిందా లేదా తగ్గిందా అనే విషయం కూడా మనకు అర్థం కావడం లేదు. అలాంటి ఒక మ్యాజిక్ చేస్తూ వెంకటేష్ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రస్తుతం 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్న వెంకటేష్ కూడా తనను తాను పృవ్ చేసుకోవాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ఈ ఏజ్ లో కూడా తను యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు. ఇక ఎప్పటికప్పుడు వెంకటేష్ తనని తాను మార్చుకుంటూ ముందుకు సాగడానికి ఇష్టపడుతూ ఉంటాడు.
అలాగే యంగ్ హీరోలను ఎంకరేజ్ చేయడంలో తన ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక దాంతో పాటుగా ఇప్పుడు కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటే మరోసారి ఆయనకు స్టార్ హీరోల నుంచి మంచి అవకాశం వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి…