https://oktelugu.com/

SA VS SL Test Match : జస్ట్ 42 పరుగులకే చాపచుట్టేసిన లంక.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు..

ఇటీవల బెంగళూరు వేదికగా భారత్ - న్యూజిలాండ్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 45 పరుగులకే ఆల్ అవుట్ అయింది. స్వదేశంలో భారత్ అలా ఆల్ అవుట్ కావడం సంచలనం కలిగించింది. అయితే ఇప్పుడు మరో జట్టు కూడా 42 పరుగులకే కుప్పకూలింది.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రికార్డును నమోదు చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 29, 2024 / 08:43 AM IST

    SA VS SL Test Match

    Follow us on

    SA VS SL Test Match : డర్బన్ వేదికగా శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికా తో తలపడుతోంది. ఇందులో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు 42 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో ఐదుగురు గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యారు. కామిందు మెండిస్ చేసిన 13 పరుగులు హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. నిశాంక 3, కరుణ రత్నే 2, మాథ్యూస్ 1, ధనుంజయ 7, లాహిరు కుమార 10 పరుగులు చేశారు. కుషాల్ మెండిస్, ప్రభాత్ జయ సూర్య, చండి మాల్, విశ్వ ఫెర్నాండో, అశిత ఫెర్నాండో 0 పరుగులకే అవుట్ అయ్యారు. కాగా, 42 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం ద్వారా శ్రీలంక జట్టు అనే చెత్త రికార్డులను నమోదు చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో శ్రీలంక జట్టుకు ఇది అత్యంత తక్కువ స్కోరు. గతంలో ఆ జట్టు 71 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇప్పటివరకు శ్రీలంక పేరు మీద అదే అత్యంత స్కోరుగా నమోదయింది.. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం క్యాండీలో పాకిస్తాన్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక 71 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అంతేకాదు గత దశాబ్ద కాలంలో తక్కువ బంతుల్లో ఆల్ అవుట్ అయిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 78 బంతుల్లోనే శ్రీలంక జట్టు ఆల్ అవుట్ అయింది..

    దక్షిణాఫ్రికా బౌలర్ సరికొత్త రికార్డు

    ఇక ఈ మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా బౌలర్ జాన్సన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అతడు తన స్పెల్ లో 7 ఓవర్లు వేయగా.. ఆ ఓవర్ల లోపే 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న రెండవ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 1924లో ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ హాగ్ టంబెల్ 6.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 28 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనతను తొలిసారి అందుకున్నాడు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ లో 191 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 42 పరుగులపై కుప్పకూలింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. స్టబ్స్(17), బవుమా(24) క్రీజ్ లో ఉన్నారు. ప్రభాత్ జయ సూర్య రెండు, విశ్వ ఫెర్నాడో ఒక వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్ లో ఆషిత ఫెర్నాండో, లాహిరు కుమార చెరి మూడు, విశ్వ ఫెర్నాండో, ప్రభాస్ జయ సూర్య రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇక ఇప్పటివరకు దక్షిణాఫ్రికా శ్రీలంకపై 281 రన్స్ లీడ్ కొనసాగిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ సైకిల్ లో శ్రీలంక ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రెండు టెస్టులో ఈ సిరీస్ లో చివరిదైన రెండవ టెస్ట్ సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా డిసెంబర్ 5 నుంచి జరగనుంది.