https://oktelugu.com/

బిగ్ బాస్ : విజయ్ దేవరకొండ మద్దతు కూడా అతనికే !

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరిదశకు చేరుకోవడంతో, ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న ఒక్కటే.. సీజన్ 4 విన్నర్‌గా ఎవరు నిలుస్తారని.. ? సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. కంటెస్టెంట్ ల టీమ్స్ ఎవరికీ వారు మా వాడికి ఓటు వేయండి అంటే మా వాడికి వేయండి అంటూ ప్రముఖుల చేత ప్రచారాలు చేయించడం మెదలెట్టేసారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ రేస్‌లో అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2020 / 06:30 PM IST
    Follow us on


    బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరిదశకు చేరుకోవడంతో, ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న ఒక్కటే.. సీజన్ 4 విన్నర్‌గా ఎవరు నిలుస్తారని.. ? సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. కంటెస్టెంట్ ల టీమ్స్ ఎవరికీ వారు మా వాడికి ఓటు వేయండి అంటే మా వాడికి వేయండి అంటూ ప్రముఖుల చేత ప్రచారాలు చేయించడం మెదలెట్టేసారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ రేస్‌లో అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐదుగురిలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనే చర్చల నేపథ్యంలో మొత్తానికి అభిజీత్‌కి రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది.

    Also Read: అఖిల్-మోనాల్ పెళ్లి… వారం తర్వాత ప్రకటన?

    కాగా సెలబ్రిటీలు కూడా అభిజీత్ కే సపోర్ట్ చేస్తుండటం నిజంగా విశేషమే. ఇప్ప‌టికే నాగ‌బాబు, శ్రీకాంత్ లాంటి స్టార్స్ అభిజీత్‌కి బాహాటంగానే మద్దతు తెలపగా.. తాజాగా విజయ్ దేవరకొండ కూడా అభిజిత్ కి పరోక్షంగా తన మద్దతు పలుకుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ టీమ్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ ”మై బాయ్స్‌కి ఎల్లప్పుడూ వారికి శుభాకాంక్షలు అందుతూనే ఉంటాయి.. ఎక్కడైనా.. ఏదైనా” అంటూ తన శైలిలో మొత్తానికి తన ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ అయితే పాస్ చేశాడు.

    Also Read: ఏడిస్తే ఓట్లు వేస్తారా..? డ్రామాలు చేస్తే ఆదరిస్తారా..?

    ఇక ఈ ఫొటోలో విజయ్‌ దేవరకొండతో పాటు అభిజిత్ కూడా ఉండటం.. తన మద్దతు అభిజిత్‌కే అన్నట్లు విజయ్ మెసేజ్ ఉండటంతో అభిజిత్ కి ఇది బాగా కలిసొచ్చేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ చేసిన ఈ పోస్ట్ కి అభిజిత్ టీమ్ ఫుల్ ఖుషీ అవుతూ విజయ్‌ దేవరకొండకు స్పెషల్ థాంక్స్ చెప్పుకొచ్చారు. అభిజిత్ హీరోగా వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్’ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఈ వారంతో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో అందరి కన్ను బిగ్ బాస్ విన్నర్‌పైనే పడింది. మరి చూద్దాం ఈ సీజన్ విన్నర్ ఎవరో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్