టీపీసీసీ ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసిన ఠాకూర్..!

టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త టీపీసీసీ ఎంపిక కసరత్తు జరుగుతోంది. టీపీసీసీని దక్కించుకునేందుకు సీనియర్లు పోటీపడుతుండటంతో చివరికీ ఆ పదవీ ఎవరికీ దక్కుతుందా? అనే ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీ రేసులో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తోంది. వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్లంతా రేవంత్ రెడ్డికి […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 6:32 pm
Follow us on

టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త టీపీసీసీ ఎంపిక కసరత్తు జరుగుతోంది. టీపీసీసీని దక్కించుకునేందుకు సీనియర్లు పోటీపడుతుండటంతో చివరికీ ఆ పదవీ ఎవరికీ దక్కుతుందా? అనే ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

టీపీసీసీ రేసులో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తోంది. వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ సీనియర్లంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతూ టీపీసీసీ కాంగ్రెస్ నేతకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి టీపీసీసీ కోసం అధిష్టానం అభిప్రాయ సేకరణ చేపట్టింది.

ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ హైదరాబాద్లో మకాం వేసి కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి నివేదికను సమర్పించారు.

తాజాగా పీసీసీ ఎంపికపై మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 162మంది నేతల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలను ఉన్నాయని తెలిపారు.

టీపీసీసీ ఎంపికపై అధిష్టానం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిందని తెలిపారు. ఇంకా ఎవరికైనా పీసీసీ ఎంపికపై అభ్యంతరాలు ఉంటే నేరుగా అధిష్టానాన్ని సంప్రదించి తమ సలహాలు ఇవ్వచ్చని తెలిపారు. త్వరలోనే టీపీసీసీపై అధిష్టానం ప్రకటన చేస్తుందని ఠాకూర్ వెల్లడించారు.