https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: మంటల్లో చెయ్యి పెట్టిన ఆదిత్య ఓం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్!

నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల ఫోటోలను మంటల్లో వేసి నామినేట్ చేయాలి. ఈ ప్రక్రియ లో ప్రేరణ ఆదిత్య ఫోటోని మంటల్లో వేయగా ఆయన ఆ మంటల్లో చేతులు పెట్టి తన ఫోటోని బయటకి తీస్తాడు. తనని తిట్టడానికి వచ్చిన వారిని కూడా బ్రతిమిలాడేంత విశాల హృదయం ఉన్న ఆదిత్య ఓం ఎందుకు ఇలా చేసాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 08:13 AM IST

    Bigg Boss 8 Telugu(60)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో రేలంగి మావయ్య లాంటి మంచోళ్ళు బయట ఉంటారో లేదో అని మనం అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ షోలో ఆదిత్య ఓం రేలంగి మావయ్య కంటే మంచోడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వయస్సు లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే చాలా పెద్దవాడు, అలాంటి వాళ్ళని జీవితంలో ఎంతోమందిని చూసి ఉంటాడు కాబట్టే హౌస్ లో అంత మంచివాడిగా ఉంటున్నాడేమో అని అనుకోవచ్చు. అలాంటి సందేహంతోనే నేడు ప్రేరణ ఆదిత్య ఓం ని నామినేట్ చేసింది. దీనికి ఆదిత్య ఓం బాగా హర్ట్ అయ్యాడు. నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యుల ఫోటోలను మంటల్లో వేసి నామినేట్ చేయాలి. ఈ ప్రక్రియ లో ప్రేరణ ఆదిత్య ఫోటోని మంటల్లో వేయగా ఆయన ఆ మంటల్లో చేతులు పెట్టి తన ఫోటోని బయటకి తీస్తాడు. తనని తిట్టడానికి వచ్చిన వారిని కూడా బ్రతిమిలాడేంత విశాల హృదయం ఉన్న ఆదిత్య ఓం ఎందుకు ఇలా చేసాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

    ముందుగా ప్రేరణ ఆయన్ని నామినేట్ చేస్తూ ‘మీరు చాలా బాగా ఆడుతున్నారు. కానీ మీలో నాకు బలమైన నమ్మకం ఎక్కడా కనిపించడం లేదు. ఎవరైనా నామినేషన్ వేస్తే చాలా తేలికగా తీసుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మీలో అసలు పోరాడే తత్వమే లేదు, ఎలిమినేట్ అయితే అయ్యాను పర్వాలేదు అనుకుంటారు. అంతే కాకుండా మీరు ఫిజికల్ టాస్కులలో బాగా వణికిపోతున్నారు, మీకు ఏమైపోతుందో అని మేము మొన్న భయపడ్డాము. ఇక నా మూడవ పాయింట్ నామినేషన్ సమయం లో మీ పాయింట్స్ ని బలంగా మాట్లాడడం మీ హక్కు, కానీ మీరు నామినేషన్ వేసే సమయంలో ఎదుటి వ్యక్తి పాజిటివ్స్ గురించి చెప్తున్నారు కానీ, నెగటివ్స్ చెప్పడం లేదు, నామినేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమే మర్చిపోతున్నారు’ అని అంటుంది ప్రేరణ.

    దీనికి ఆదిత్య ఓం సమాధానం చెప్తూ ‘నేను నామినేట్ చేసేటప్పుడు నా పద్దతి నాకు ఉంటుంది. అవతల వ్యక్తికీ సంబంధించి కేవలం నెగటివ్స్ ని మాత్రమే ఎందుకు చెప్పాలి. వాళ్ళ గురించి మంచి విషయాలు కూడా చెప్తాను, నేను ఇన్ని రోజులు అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను కూడా, ఇక్కడ నెగటివ్స్ చెప్పడానికి హౌస్ ఉన్నవాళ్లు విలన్స్ కాదు కదా..మీకు ఇష్టంలేని వాళ్ళను పొగడడం మీకు నచ్చలేదు..అందుకే నామినేట్ చేస్తున్నారు’ అని అంటాడు ఆదిత్య ఓం. ఆ తర్వాత ప్రేరణ ఆదిత్య ఓం ఫోటో ని మంటల్లో వేసి నామినేట్ చేసి వెళ్తుండగా, నాకు నా మీద నమ్మకం లేదు అన్నావ్ కదా, చూడు ఏమి చేస్తున్నానో అని చెప్పి మంటల్లో చెయ్యి పెట్టు తన ఫోటోని బయటకి తీస్తాడు. చూసావా ఇదే నా బలం, టాస్కులు ఇస్తే ఆ రేంజ్ లో ఆడగలను అని అంటాడు. దీనికి బిగ్ బాస్ నుండి ఆదిత్య కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ వస్తుంది. మంటల్లో చేతులు పెట్టడం ఆటలుగా అనిపిస్తుందా, ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అంటూ హెచ్చరిస్తాడు బిగ్ బాస్.