Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సరికొత్త సీజన్ కు కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారో తెలుసుకోవాలనే ఆతృత బిబి లవర్స్ లో ఉంది.కాగా యూట్యూబర్ ఆదిరెడ్డి ఈ సస్పెన్సు కి తెరదించాడు. ఆయనకున్న సమాచారాన్ని బట్టి కొందరు పేర్లను రివీల్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ లో కంటెస్టెంట్స్ లిస్ట్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ ఫేమస్ అయ్యాడు ఆదిరెడ్డి. ఆ పాపులారిటీ తో బిగ్ బాస్ సీజన్ 6లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఫైనల్ వరకు చేరుకొని టాప్ 5లో నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పే రివ్యూలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ఆది రెడ్డి(Adireddy) తన అంచనా ప్రకారం సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొన్ని పేర్లు చెప్పారు.
Also Read: Indraja: జబర్దస్త్ కి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన నటి ఇంద్రజ!
ఆ లిస్ట్ పరిశీలిస్తే .. బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, నటి సోనియా సింగ్(Sonia Singh), నటి హేమ(Hema), ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ. వీరిలో ఇద్దరూ రావొచ్చట. నేత్ర కి ఎక్కువ ఛాన్స్ ఉందట. జబర్దస్త్ నరేష్ లేదంటే రియాజ్ వచ్చే అవకాశం ఉంది. రీతూ చౌదరి, సురేఖ వాణి లేదంటే ఆమె కూతురు సుప్రీత రావచ్చట. కిరాక్ ఆర్పీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్ లేక చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుండి రావొచ్చట.
Also Read: Sudigali Sudheer: నువ్వు బుల్లి తెరకి మారాజువి ! వెండితెర వద్దు, ఇక్కడే ఉండిపో సుధీరన్నా !
అమృత ప్రణయ్ వచ్చే ఛాన్స్ ఉందట. నీతోనే డాన్స్ షోలో పాల్గొన్న జంటల్లో ఒకరు లేదా ఒక జంట రావొచ్చట. పాత కంటెస్టెంట్స్ లో అంజలి పావని, యాంకర్ శివకు ఎక్కువ ఛాన్స్ ఉందని సమాచారం. నయని పావని కూడా అవకాశం రావచ్చని తెలుస్తుంది. స్రవంతి చొక్కారపు, సోహెల్ కి కూడా ఛాన్స్ ఉంది. చెఫ్ సంజయ్ తుమ్మ, రైతుబడి రాజేంద్ర రెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కూడా వచ్చే అవకాశం ఉందట. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న ప్రారంభం అవుతుందని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఇది ఆయన అంచనా మాత్రమే అధికారిక సమాచారం కాదు.