Indraja: 2013లో ఎటువంటి అంచనాలు లేకుండా ప్రారంభమైంది జబర్దస్త్(Jabardasth). అనంతరం ఈ షో అనేక సంచలనాలకు వేదిక అయ్యింది. ఎంతోమంది సామాన్యులు ఈ షో ద్వారా స్టార్స్ గా ఎదిగారు. రోజా(Roja), నాగబాబు(Nagababu) జడ్జీలుగా వ్యవహరించిన జబర్దస్త్ షో అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. జబర్దస్త్ ముందు మరో కామెడీ షో నిలవలేకపోయింది. కానీ ఇటీవల కాలంలో జబర్దస్త్ లో మునుపటి కామెడీ కనిపించడం లేదు.
గతంలో జబర్దస్త్ కి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఇందుకు ప్రధాన కారణం షోలో జరుగుతున్న మార్పులు చేర్పులు. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్నంత కాలం జబర్దస్త్ టాప్ టీఆర్పీ తో దూసుకుపోయింది. మల్లెమాల సంస్థతో విబేధాలు తలెత్తగా నాగబాబు షో నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సింగర్ మనో జడ్జిగా వచ్చారు. రోజాకు మంత్రి పదవి దక్కింది. నిబంధనల ప్రకారం ఆమె జబర్దస్త్ ని వీడాల్సి వచ్చింది.
Also Read: Sudigali Sudheer: నువ్వు బుల్లి తెరకి మారాజువి ! వెండితెర వద్దు, ఇక్కడే ఉండిపో సుధీరన్నా !
యాంకర్ అనసూయ, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర… ఇలా ఒకరి తర్వాత ఒకరు షో నుండి బయటకు వచ్చేశారు. దీంతో జూనియర్ కమెడియన్స్ తో జబర్దస్త్ షోని నడిపిస్తున్నారు. కాగా రోజా స్థానంలో నటి ఇంద్రజను జడ్జి గా తీసుకొచ్చారు. ఇంద్రజ తక్కువ సమయంలోనే కమెడియన్స్ తో కలిసిపోయింది. వాళ్లపై రివర్స్ పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇంద్రజ.
చాలా కాలంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోలకు ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంద్రజ బాంబు పేల్చారు. ఆమె అనూహ్యంగా షో నుండి తప్పుకుంటున్నట్లు చెప్పి షాకిచ్చింది. ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తున్నట్లు వివరించింది. ఈ విషయం చెప్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అయితే కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఇంద్రజ వెళ్లిపోతుంటే కమెడియన్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్త్ ని వీడినా, మరలా ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.