Viral Video: నవ మాసాలు మోస్తుంది. కడుపులో తంతున్నా ఓర్పుగా భరిస్తుంది. తన స్తన్యంతో ఊపిరిలూదుతుంది. నేర్పుగా లాలపోస్తుంది. ప్రేమతో జోల పుచ్చుతుంది. ఆకాశంలో చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తుంది. నడకలో, నడవడికలో, బతుకులో, బతుకుదెరువులో.. ఇలా ఒక మనిషి జీవితంలో తల్లి పాత్ర కీలకంగా ఉంటుంది. ఆమే కీలకమవుతుంది. అందుకే మాతృదేవోభవ అంటారు. “తల్లి ఉన్నచోట ఆకలి ఉండదు.. ఆపద ఉండదు. కష్టం ఉండదు. కన్నీళ్లు ఉండవు” అంటారు పెద్దలు. వీటిని నిరూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి. మన దైనందిన జీవితంలో ఎన్నో చూసి ఉంటాం. కానీ మీరు చదవబోయే ఈ కథనం మాత్రం పూర్తి డిఫరెంట్. ఎందుకంటే..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. కెన్యాలోని ఓ దట్టమైన అడవిలో.. అప్పుడే ఓ జింక ప్రసవించింది. ఇంకా ఆ పసి గుడ్డు. నెత్తురు వాసనను కూడా కోల్పోలేదు. జింక ప్రసవించిన తర్వాత.. తన పిల్లను చూసి మురిసిపోతోంది. ఇదే సమయంలో పొదల మాటున నక్కి ఉన్న ఓ పులి.. ఆ జింక ప్రసవించిన దృశ్యాన్ని చూసింది. ఆ జింక పిల్ల మీదకు అమాంతం దాడి చేసింది. సాధారణంగానే పిరికి జంతువుగా పేరుపొందిన జింక.. ఆ పులి దాడి నుంచి తన పిల్లను కాపాడుకుంది.. పులికి ఎదురు తిరిగింది.. అయినప్పటికీ ఆ పులి ఆ జింక పిల్లను నోట కరుచుకుంది. ఈ విపత్తుకు భయపడకుండా.. పులికి ధైర్యంగా సవాల్ విసిరింది జింక.. తనకు కొమ్ములు లేకపోయినప్పటికీ.. తలతో పులిని తరిమి తరిమి కొట్టింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. nature is amazing అనే ట్విట్టర్ ఐడిలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది చూశారు.. జింక తెగువను చూసి అభినందిస్తున్నారు.. ఈ భూమ్మీద తల్లిని మించిన దైవం లేదని కొనియాడుతున్నారు. తన ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ఆ జింక పులికి ఎదురు తిరిగింది. తన పిల్ల ప్రాణాలను కాపాడుతుందని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తల్లిని మించిన దైవం లేదు.. ఆమెను మించిన రక్షణ మరొకటి ఉండదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Mothers are the best pic.twitter.com/qgqmyIIRPW
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 29, 2024