https://oktelugu.com/

Bigg Boss Telugu Non Stop OTT: బిగ్ బాస్ లోకి మరో వైల్డ్ కార్డ్.. హౌస్ లోకి బెస్ట్ ఎంటర్ టైనర్

Bigg Boss Telugu Non Stop OTT: తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో బిగ్ బాస్.. ఇప్పుడు ఓటీటీ రూపు సంతరించుకొని 24 గంటలూ ప్రసారమవుతోంది. విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజంతా ప్రసారం అవుతుండడంతో ఎవరు బాగా ఆడుతున్నారు..? ఎవరు ఆడడం లేదన్నది ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతోంది. ఇప్పటికే రంజుగా సాగుతున్న బిగ్ బాస్ కు ఇప్పుడు కాస్త మసాలా , ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2022 / 10:48 AM IST
    Follow us on

    Bigg Boss Telugu Non Stop OTT: తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో బిగ్ బాస్.. ఇప్పుడు ఓటీటీ రూపు సంతరించుకొని 24 గంటలూ ప్రసారమవుతోంది. విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజంతా ప్రసారం అవుతుండడంతో ఎవరు బాగా ఆడుతున్నారు..? ఎవరు ఆడడం లేదన్నది ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతోంది. ఇప్పటికే రంజుగా సాగుతున్న బిగ్ బాస్ కు ఇప్పుడు కాస్త మసాలా , ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఎంటర్ టైనర్ ను హౌస్ లోకి దించాలని యోచిస్తున్నారు. ఆ కామెడీ పంచే ఎంటర్ టైనర్ ఎవరు? ఎప్పుడు వెళుతాడన్న దానిపై స్పెషల్ ఫోకస్.

    Bigg Boss Telugu Non Stop OTT

    ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీలో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డ్ నెస్ ఎక్కువైందన్న విమర్శ ఉంది. ఓటీటీలోకి ఎక్కడంతో ఆ మాత్రం ఉండాలని అంటున్నారు. దీంతో ఇది మరింత రంజుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే నాన్ స్టాప్ బిగ్ బాస్ లో ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈరోజు మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: Bigg Boss Telugu OTT: బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బిగ్‌బాస్‌ను అది కావాల‌ని కోరిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌..!

    బిగ్ బాస్ అంటేనే ఊహించని ట్విస్టులు.. ఇక ఓటీటీవెర్షన్ లో అంతకుమించి ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్ లో ఎక్కువ మంది గెస్టులను హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోందట.. అంతేకాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి..

    ప్రస్తుతం బిగ్ బాస్ నుంచి అందుతున్న సమాచారం.. ఇదివరకూ బిగ్ బాస్ లో పాల్గొన్న పలువురు కొత్త మోడళ్లు, గత సీజన్లలో పాల్గొన్న ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే సగం రోజులు పూర్తి కావడంతో బెస్ట్ ఎంటర్ టైనర్ ను పంపి కాస్త వినోదాన్ని పంచడానికి బిగ్ బాస్ టీం రెడీ అయ్యిందట..

    బిగ్ బాస్ మూడో సీజన్ లో తనదైన కామెడీతో బెస్ట్ ఎంటర్ టైనర్ అనిపించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ నిజాయితీగా ఉంటూ కామెడీ పండించి ఆ సీజన్ ఫైనల్ వరకూ ఉన్నాడు. చివరకు సెకండ్ రన్నరప్ గా నిలిచాడు. ఇప్పుడు బాబాను బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి పంపడానికి నిర్వాహకులు రెడీ అయ్యారట.

    Bigg Boss Telugu Non Stop OTT

    ప్రస్తుతం బాబా భాస్కర్ స్టార్ మాలోనే ‘ఇస్మార్ట్ జోడీ’ చేస్తున్నారు. ఆ షోకు సంబంధించిన షూట్ మొత్తాన్ని ఆయన పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ లోకి బాబాను దించాలని ప్లాన్ చేస్తున్నారట.. ఈ రెండు రోజుల్లోనే ఆయన ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. బిగ్ బాస్ ఓటీటీలోకి బాబా భాస్కర్ వస్తే ఇక రచ్చ రంబోలానే అని అంటున్నారు.

    Also Read:Shah Jahan: సండే స్పెషల్: షాజహాన్ కన్న కూతురిని కూడా వదలలేదా..? సంచలన నిజాలివీ

    Tags