https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సీత దొంగ ఏడుపులకు క్లాస్ పీకిన రాయల్స్..నామినేషన్స్ లో నయనీ పావని అదుర్స్!

యష్మీ తన దరిద్రమైన ప్రవర్తనతో ఎలిమినేట్ అయ్యేందుకు పోటీ పడుతుంది. అదంతా కాసేపు పక్కన పెడితే ఈరోజు నయనీ పావని సీతని నామినేట్ చేస్తూ, ఆమె దొంగ ఏడుపులను ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేస్తుంది. నయనీ పావని ఆమెని నామినేట్ చేసిన తర్వాత మాట్లాడుతూ 'మీరు చీఫ్ అయిన తర్వాత నుండి మీ ఆట నాకు అసలు కనిపించలేదు. మొదటి రెండు వారాల్లో మీలో నాకు మంచి ఫైర్ కనిపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 08:41 AM IST

    Bigg Boss Telugu 8(90)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ ప్రారంభం లో ఆడియన్స్ కి బాగా నచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరు కిరాక్ సీత. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, గేమ్స్ లో చాలా చురుగ్గా ఉంది, ప్రతీ ఒక్కరితో స్నేహం చేస్తుంది, ఇలా ఎన్నో పాజిటివ్ యాంగిల్స్ ఆమెలో ఉండడం వల్ల ఈమెకు హౌస్ లోపల ఉండే కంటెస్టెంట్స్ కి , అలాగే హౌస్ బయట ఉండే కంటెస్టెంట్స్ కి మొదటి రెండు వారాలు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఈమె చీఫ్ అయ్యినప్పుడు ఈమె క్లాన్ లో వచ్చేందుకు కంటెస్టెంట్స్ చాలా ఆసక్తి చూపించారు. అంత మంచి పేరు తెచ్చుకున్న సీత, గత రెండు వారాలుగా దొంగ ఏడుపులు ఏడుస్తూ, మణికంఠ మీద తనకు ఉన్న కుళ్ళుని మొత్తం బయటపెడుతూ, ఎలాంటి గేమ్స్ ఆడకుండా, తన గ్రాఫ్ ని పూర్తిగా తగ్గించేసుకుంది. ప్రస్తుతం ఓటింగ్ లైన్ లో అందరికంటే తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నది ఆమెనే.

    ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ యష్మీ తన దరిద్రమైన ప్రవర్తనతో ఎలిమినేట్ అయ్యేందుకు పోటీ పడుతుంది. అదంతా కాసేపు పక్కన పెడితే ఈరోజు నయనీ పావని సీతని నామినేట్ చేస్తూ, ఆమె దొంగ ఏడుపులను ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేస్తుంది. నయనీ పావని ఆమెని నామినేట్ చేసిన తర్వాత మాట్లాడుతూ ‘మీరు చీఫ్ అయిన తర్వాత నుండి మీ ఆట నాకు అసలు కనిపించలేదు. మొదటి రెండు వారాల్లో మీలో నాకు మంచి ఫైర్ కనిపించింది. ఫుడ్ కోసం పెట్టిన టాస్కులలో ప్రతీసారీ మీ క్లాన్ లో వాళ్లనే ఆడేందుకు పంపారు కానీ మీరు ఆడేందుకు సిద్ధంగా లేరు. అంతే కాదు ఎవరినైనా నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారని మీకు తెలుసు. అయినప్పటికీ నామినేట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ అయితే మీరే ఏడుస్తారు. ఇది ఎందుకో నాకు చాలా ఫేక్ అనిపించింది’ అని అంటుంది. దీనికి సీత మాట్లాడుతూ ‘నా ప్రకారం బిగ్ బాస్ షోలో టాస్కులు ఆడడం ఒక్కటే కాదు, మన పర్సనాలిటీ ని చూపించుకోవడం కూడా ముఖ్యం. ఒక క్లాన్ చీఫ్ గా నేను అందరినీ ఆడించాలి కాబట్టి ఆడించాను, అంతకు ముందు నేను టాస్కులు బాగా ఆడడం వల్లే నన్ను చీఫ్ ని చేసారు’ అని అంటుంది.

    నాకెందుకో మీరు క్రై బేబీ లాగ అనిపించారు అని నయనీ పావని అనగా, దానికి సీత సమాధానం చెప్తూ ‘నాకు ఇక్కడ అందరూ చాలా క్లోజ్..మీరు కూడా భవిష్యత్తులో ఎవరైనా ఎలిమినేట్ అయితే ఏడుస్తారు, అప్పుడు నేను కూడా చూస్తాను’ అని అంటుంది సీత. నాకెందుకో మీరు కావాలని సానుభూతి కోసం ఏడుస్తున్నట్టుగా అనిపించింది, అందులో నిజం లేదు అని చెప్పుకొస్తుంది నయనీ పావని. ఆ తర్వాత ఈమెకు టేస్టీ తేజా కూడా నామినేషన్ వేస్తాడు, ఆయన చెప్పిన కారణాలలో కూడా ఇది ఉంది , ఇంత మంది ఇచ్చిన క్లూలు తీసుకొని సీత తన ఆట తీరుని మార్చుకుంటుందా, లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.