https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అలా చెప్పకండి సార్ అంటూ నాగార్జున పై చిరాకుపడిన యష్మీ.. నిజాలు చెప్తే హోస్ట్ ని లెక్క చేయరా?

నేడు యష్మీ నాగార్జున మీద చిరాకు పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె గౌతమ్ ని అన్యాయం గా టార్గెట్ చేసి గేమ్ నుండి తొలగించిన విషయం వాస్తవం. గౌతమ్ బాగా ఆడినప్పటికీ కూడా, బాగా ఆడలేదని హౌస్ మేట్స్ అందరికీ చెప్పి అతనిపై బురద చల్లింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 07:55 AM IST

    Bigg Boss Telugu 8(197)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్స్ ఈమధ్య ఉల్టా పల్టా అవుతున్నాయి. శనివారం రోజు నాగార్జున ఇంతకుముందు వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కడిగిపారేసేవాడు. కానీ ఈసారి మాత్రం శనివారం ఎపిసోడ్స్ లో ఒకటి రెండు తప్పా మిగిలినవన్నీ చాలా కూల్ గా లాగేస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. నాగార్జున హోస్టింగ్ ఈ సీజన్ లో చాలా చెత్తగా ఉందని, షో డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి నాగార్జున హోస్టింగ్ కూడా ఒక కారణమని అంటున్నారు. ఉదాహరణకి ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటిని సరైన పద్దతిలో అడ్రెస్ చేసి హౌస్ మేట్స్ ని నాగార్జున సరిచేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అసంపూర్ణంగానే శనివారం ఎపిసోడ్ ని ముగించి అటు ఇటు కాకుండా చేసేసాడు.

    ఇకపోతే నేడు యష్మీ నాగార్జున మీద చిరాకు పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె గౌతమ్ ని అన్యాయం గా టార్గెట్ చేసి గేమ్ నుండి తొలగించిన విషయం వాస్తవం. గౌతమ్ బాగా ఆడినప్పటికీ కూడా, బాగా ఆడలేదని హౌస్ మేట్స్ అందరికీ చెప్పి అతనిపై బురద చల్లింది. మెగా చీఫ్ టాస్కులలో టీం మొత్తం ఓడిపోయింది. కానీ గౌతమ్ కారణంగానే ఓడిపోయినట్టు జనాలకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. మరోపక్క ఈమె ప్రియుడు నిఖిల్ ఎల్లో కార్డు మీ టీం కి ఇస్తాను , నువ్వు గౌతమ్ ని తీసేయాలి అని యష్మీ ని రూమ్ లోపలకి తీసుకెళ్లి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కెమెరాల ముందు యష్మీ నేను గౌతమ్ ని తియ్యలేను అని నిఖిల్ తో చెప్తూ డ్రామాలు చేసింది కానీ, చివరికి గౌతమ్ ని టీం నుండి తప్పించింది. ఇదంతా పక్కన పెడితే నేడు నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ యాక్షన్ రూమ్ లోకి పిలిచి 8 రకాల లక్షణాలు ఉన్న జ్యూస్లను కలిపి ఎవరో ఒక కంటెస్టెంట్ కి ఇవ్వండి అని చెప్తుంది. హరితేజ నిఖిల్ కి చిల్లీ, ఆమ్లా జ్యూస్ ని కలిపి, నిఖిల్ యష్మీ ని మ్యానిపులేట్ చేసిన విషయాన్ని గుర్తు చేసి ఇస్తుంది.

    ఆ తర్వాత హరితేజ కారణాలు చెప్తూ ‘నిర్ణయాలు తీసుకునే సమయంలో కరెక్ట్ గా ఎంటర్ అయ్యి మొత్తం మ్యానిపులేట్ చేసేస్తాడు సార్. ఆటలు ఆడేటప్పుడు కూడా నేను గమనించాను, పక్క టీం వాళ్ళ దగ్గరకు వెళ్లి అది చేయ్, ఇది చేయ్ అని చెప్తున్నాడు. మా టీంలో ఉన్నాడు కాబట్టి నాకు గర్వంగా అనిపించింది, వేరే టీం లో ఉండుంటే నేను అప్పుడే చెప్పేదానిని’ అని అంటుంది. అప్పుడు నాగార్జున ‘నాకు కూడా అనిపించింది..యష్మీ ని నిఖిల్ మ్యానిపులేట్ చేసాడని’ అని అంటాడు. అయ్యో దేవుడు సాక్షిగా లేదు సార్ అని నిఖిల్ అంటాడు. వెంటనే యష్మీ కూడా స్పందిస్తూ ‘అయ్యో లేదు సార్!, దయచేసి మీరు అలా చెప్పకండి’ అని అంటుంది. ‘ఏమో..పృథ్వీ కూడా అదే చెప్పాడు’ అని నాగార్జున అనగా, ‘ఏంటిరా నిజమా’ అని యష్మీ అడగగా, నేనేమి చెప్పలేదురా బాబు నన్ను వదిలేయ్ అని పృథ్వీ అంటాడు.