US Presidential Election : ప్రపంచమంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. నవంబర్ 5(మంగళవారం) పోలింగ్ జరుగనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముందస్తు పోలింగ్ భారీగా నమోదైంది. మెజారిటీ పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల రేసులో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఆఖరి ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు. ఎన్నికల రోజు రద్దీ దృష్టిలో ఉంచుకుని చాలా మంది ముందస్తు పోలింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ కేంద్రాలను పెంచడంతోపాటు పోలింగ్ కూడా పెరిగింది. 6.8 కోట్ల మంది ఓటు వేశారు.
నార్త్‌కరోలినాలో ట్రంప్..
చివరి ప్రయత్నాల్లో భాగంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనకు ఇష్టమైన నార్త్ కరోలినాలో మకాం వేశారు. గతంలో రెండుసార్లు(2016, 2020)లో ఈ రాష్ట్రం ఆయనకు మద్దతుగా నిలిచింది. దీంతో ఈసారి కూడా అక్కడే మెజారిటీ సాధించడంతోపాటు సమీపంలోని వర్జీనియా, న్యూమెక్సికోలనూ సీరియస్‌గా తీసుకున్నారు. ఆదివారం కింగ్‌స్టన్‌లో ప్రచారం చేశారు. ఇక కమలా హారిస్ కూడా నార్త్ కరోలినాలోని చార్లెట్‌లో శనివారం ప్రచారం చేశారు. సోమవారం కూడా తన భర్త ఎగ్‌ఎం హోఫ్‌ను గ్రీన్‌విల్లేకు ప్రచారానికి పంపుతున్నారు. మరోవైపు నార్త్ కరోలినాలో 78 లక్షల మంది ఇప్పటికే ఓటేశారు. అంటే సుమారు సగం మంది ఓటహక్కు వినియోగించుకున్నారు.
హారిస్ ఇంటర్వ్యూలు..
ఇక అధికార డెమొక్రటిక్ పార్టీ నేత కమలా హారిస్ ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇస్తున్నారు. పత్రికలకు ఆర్టికల్స్ రాస్తున్నారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన ఓపీనియన్స్ మీడియా ఇంటర్వ్యూల్లో ఓపెన్ చేస్తున్నారు. ఎక్స్ వేదికగా తన ఎమెషన్స్‌ను షేర్ చేస్తున్నారు. మహిళల అబార్షన్ గురించి మాట్లాడుతున్నారు. తద్వారా మహిళల ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అనే ప్రమాదం నుంచి అమెరికాను కాపాడాలని కోరుతున్నారు.