https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ మీద పీకల దాకా పగ పెంచేసుకున్న యష్మీ అక్క.. నాగార్జున ముందే గొడవలు!

గౌతమ్ సమాధానం చెప్తూ 'నిన్ను నెగటివ్ చేయాలనీ, నిన్ను క్రిందకి లాగుదామని నేనెప్పుడూ ప్రయత్నం చేయలేదు. మన టీం లో ఏదైనా మిస్ అయ్యినప్పుడు ఒక టీం మెంబర్ గా నీకు చెప్పాను. ఆ హక్కు కూడా నాకు లేదు అనిపిస్తే నేనేమి చేయలేను' అని అంటాడు గౌతమ్. అప్పుడు యష్మీ 'లీడర్ గా నేను తప్పు చేశాను అనుకుందాం.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 07:51 AM IST

    Bigg Boss Telugu 8(196)

    Follow us on

    Bigg Boss Telugu 8: రేపు జరగబోయే నామినేషన్స్ ఎపిసోడ్ లో యష్మీ, గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరిగేలాగా అనిపిస్తుంది. ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిన చోట కాస్త హాట్ హాట్ చర్చలు జరిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే యాక్షన్ రూమ్ లోకి హౌస్ మేట్స్ ని పిలిచిన నాగార్జున 8 రకాల లక్షణాలు ఉన్న జ్యూస్లు ఉన్నాయి, అవి హౌస్ మేట్స్ లో ఎవరికీ డేడికేట్ చేస్తావో చెప్పి చేయండి అని అంటాడు నాగార్జున. ముందు గౌతమ్ ని ప్రారంభించమని చెప్పగా గౌతమ్ ఫేక్, స్వార్థం లక్షణాలు ఉన్న జ్యూస్లను కలిపి యష్మీ కి ఇస్తాడు. నన్ను గేమ్ నుండి తీసేటప్పుడు ఒక మాట, నిన్న ఇక్కడ ఇంకో మాట చెప్పింది. అందుకే నాకు ఆమె ఫేక్ అనిపించింది కాబట్టి ఈ జ్యూస్ ఇస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత యష్మీ వంతు వచ్చినప్పుడు ఇదే లక్షణాలు ఉన్న జ్యూస్లను కలిపి గౌతమ్ కి ఇస్తుంది.

    ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ‘అతను మంచిగా బయట జనాలకు అనిపించాలని ఇంకొకరిని నెగటివ్ చేయాలనీ చూస్తాడు సార్. ఆడియన్స్ కి తాను చెప్పేది అర్థం కావాలని, ఒకే విషయాన్నీ పదేపదే చెప్తూ ఉంటాడు. నేను ఇది అతనిలో చాలాసార్లు గమనించాను. ఈ వారం నాకు అతని గురించి మొత్తం అర్థమైపోయింది, ఒక టీం లీడర్ గా మనం బాగా ఆడాలనే ఉద్దేశ్యంతో, ఇక్కడ నీ వల్ల పొరపాటు జరిగింది చూసుకో అని చెప్పాను. కోపం గా కూడా నేను చెప్పలేదు, అతనిలో ఉత్సాహం నింపేందుకు నేను అతనికి నేరుగా చెప్పలేకపోయాను. కానీ ఈరోజు ఆయన దానిని తీసుకొచ్చి ఇక్కడ నాదే తప్పుడు అన్నట్టు చూపిస్తున్నాడు. ఈరోజు నాకు అర్థమవుతుంది, ఇతను చాల స్వార్థపరుడు, ఫేక్ వ్యక్తి. ఆయన గేమ్ వరకే చూసుకుంటాడు, పక్కన వాళ్ళు ఏమైపోయినా అతనికి సంబంధం లేదు, ఆయన మంచిగా అనిపించడానికి వేరే వాళ్ళని జనాలకు నెగటివ్ గా చూపించాలని అనుకుంటాడు’ అని చెప్తుంది యష్మీ.

    దానికి గౌతమ్ సమాధానం చెప్తూ ‘నిన్ను నెగటివ్ చేయాలనీ, నిన్ను క్రిందకి లాగుదామని నేనెప్పుడూ ప్రయత్నం చేయలేదు. మన టీం లో ఏదైనా మిస్ అయ్యినప్పుడు ఒక టీం మెంబర్ గా నీకు చెప్పాను. ఆ హక్కు కూడా నాకు లేదు అనిపిస్తే నేనేమి చేయలేను’ అని అంటాడు గౌతమ్. అప్పుడు యష్మీ ‘లీడర్ గా నేను తప్పు చేశాను అనుకుందాం..నువ్వు ఆరోజు ఎందుకు చెప్పలేదు?, గేమ్ లో నేను ముందు ఉన్నాను కదా, ఎల్లో కార్డు నువ్వే తీసుకో యష్మీ అని చెప్పొచ్చు కదా?, ఎందుకు చెప్పలేదు?, నాకు అర్థమైంది ఏమిటంటే నేను అక్కడ నెగటివ్ అవ్వాలి, నువ్వు మాత్రం మంచోడివి అనిపించుకోవాలి అనుకున్నావు’ అని అంటుంది. అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ ‘హలో యష్మీ..నువ్వు ఎల్లో కార్డు ఇచ్చినందుకు కాదు నేను మాట్లాడుతున్నది. అప్పుడు నాకు చెప్పిన కారణం వేరు, ఇప్పుడు నువ్వు చెప్తున్న కారణం వేరు’ అని అంటాడు. దానికి నాగార్జున మాట్లాడుతూ అప్పుడు చెప్పిన కారణం నీకు ఓకే నా అంటే, గౌతమ్ దానికి ఓకే సార్ అంటాడు. మరి ఇంకేంటి గొడవ సైలెంట్ గా కూర్చోండి అంటాడు.