Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫైర్ బ్రాండ్స్ గా పేరు తెచ్చుకున్న లేడీ కంటెస్టెంట్స్ యష్మీ, సోనియా. నామినేషన్స్ సమయంలో వీళ్ళు శివంగులు లాగా రెచ్చిపోయి విలయతాండవం చేస్తారు. యష్మీ అయితే అసలు ఏ కారణం లేకపోయినా కూడా పెద్దగా అరుస్తూ ఊగిపోతూ ఉంటుంది. ఈమె ప్రవర్తన చూసి చాలా మంది సైకో అని పిలవడం ప్రారంభించారు. ఇక సోనియా సంగతి సరేసరి, ఈమె నోటికి ఆనకట్ట ఉండదు. చూసేందుకు అందమైన ముఖం తో, చక్కటి చిరునవ్వుతో అందరికీ కనిపిస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఈమె మనిషి అనే విషయాన్ని మర్చిపోతుంది. ముఖ్యంగా విష్ణు ప్రియా పై ఆమె చేసిన అతి నీచమైన కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏ రేంజ్ లో విరుచుకుపడ్డారో మన అందరికీ తెలిసిందే. యష్మీ ఆవేశం లో మాట్లాడేస్తుంది కానీ, చాలా సున్నితమైన మనస్కురాలు.
గట్టిగా ఎవరైనా మాట్లాడితే ఏడ్చేస్తుంది. కానీ సోనియా అలా కాదు. ఈమెకి పాము తెలివితేటలు కూడా చాలానే ఉన్నాయి. నిఖిల్ టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అనే విషయాన్ని తెలుసుకొని, అతనితో స్నేహం చేసి, అతని ఆటను ఈమె ఎలా చెడగొట్టే ప్రయత్నం చేసిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది చూసారు. అయితే నోరేసుకొని పడిపోయే యష్మీ, సోనియా మధ్య గొడవలు జరిగితే చూడాలని చాలా మంది కోరుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నేడు జరిగిన నామినేషన్స్ లో వీళ్లిద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ముందుగా యష్మీ మాట్లాడుతూ ‘నువ్వు గత వారం నా క్లాన్ లో ఉన్నావు. నా క్లాన్ ని గెలిపించేందుకు నువ్వు ఎలాంటి కృషి చెయ్యలేదు. నీ ద్రుష్టి 24 గంటలు నిఖిల్, అభయ్, పృథ్వీ రాజ్ మీదనే ఉంది కానీ, గేమ్ మీద లేదు’ అంటూ యష్మీ సోనియా ని నామినేట్ చేస్తుంది.
తనని ఏమి అనకపోయినా కూడా విష్ణు ప్రియ పై పగబట్టి ఆమెని నానా మాటలు అంటూ టార్చర్ చేసిన సోనియా, ఇక యష్మీ ఆ స్థాయిలో మాట్లాడగానే ఎలా రెచ్చిపోయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చింది అనేది తెలియాలంటే ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. యష్మీ, సోనియా తర్వాత ప్రేరణ, నబీల్ మధ్య పెద్ద గొడవ జరిగింది. గత వారం లో జరిగిన సాక్స్ టాస్క్ లో హోస్ట్ గా వ్యవహరించిన ప్రేరణ, నబీల్ విషయం లో అన్యాయం చేసింది. అందుకే ఆమెని నామినేట్ చేసాడు. తనని ఎవరైనా నామినేట్ చేస్తే పెద్ద గొంతు తో రెచ్చిపోయి మాట్లాడే ప్రేరణ నబీల్ తో కూడా అలాగే మాట్లాడింది. అప్పుడు నబీల్ ‘నువ్వు గొంతు పెంచితే, నేను నీకంటే ఎక్కువగా గొంతు పెంచగలను’ అంటూ పెద్దగా అరుస్తాడు. అప్పుడు ప్రేరణ పెంచుకో ఎవరు కాదు అన్నారు అంటూ నబీల్ ని రెచ్చగొడుతుంది, తర్వాత ఏమి జరిగిందో నేటి ఎపిసోడ్ లో చూడాలి.