Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన మూడు వారాల్లోనే విపరీతమైన నెగటివిటీ ని ఏర్పాటు చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియా నే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో ఆడ పులి అని చెప్పుకొని తిరిగేది. నిజంగానే ఆడ పులి ఏమో, టాస్కులు కుమ్మేస్తాదేమో, ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ టాస్కుల మీదకంటే ఈమె ఎక్కువగా నిఖిల్, పృథ్వీ రాజ్ లతో పులిహోర కలపడంలోనే ఎక్కువ శ్రద్ద చూపించింది. హౌస్ లో బాగా ఆడే కంటెస్టెంట్స్ అయిన వీళ్ళిద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తుంది అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటుగా ప్రేక్షకులకు కూడా అర్థం అయ్యింది. ఇంత నెగటివిటీ ఏర్పడింది కాబట్టి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఈమె ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఓటింగ్ మొత్తం తారుమారు అయ్యిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.
నిన్న ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి ప్రేరణ అందరికంటే అత్యధికమైన ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుందని తెలుస్తుంది. ఆమె తర్వాతి స్థానం లో నబీల్ ఉన్నాడు. వాస్తవానికి సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ లో నబీల్ మొదటి స్థానం లో ఉన్నాడు. కానీ ప్రేరణ సీరియల్ ఆర్టిస్ట్ అవ్వడం తో ఆమెకి టీవీ సీరియల్ అభిమానులు చాలా ఎక్కువ, అందుకే ఆమె టాప్ 1 కి చేరుకుంది. వీళ్లిద్దరి తర్వాత మణికంఠ మూడవ స్థానం లో కొనసాగుతుండగా, నాల్గవ స్థానం లో సోనియా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఐదవ స్థానం లో పృథ్వీ రాజ్, 6 వ స్థానం లో ఆదిత్య ఓం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ వారం దాదాపుగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అనేది ఖరారు అయ్యింది. వాస్తవానికి సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ రాజ్ కి దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ వచ్చిందట.
కానీ వీళ్ళ ముగ్గురి ఓటింగ్ గంట గంటకు మారుతూ ఉండడం తో, నిన్న రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి సోనియా సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆమె సేఫ్ జోన్ లోకి రాకపోయినా కూడా ఆదిత్య ఓం ని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీం నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఆదిత్య ఓం వయస్సు రీత్యా టాస్కులు సరిగా ఆడలేకపోతున్నాడు, అదే విధంగా ఆయన నుండి టీం కి ఎలాంటి కంటెంట్ కూడా రావడం లేదు. రెమ్యూనరేషన్ కూడా ఆయనకు భారీ చెల్లిస్తున్నారు. హౌస్ ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే అన్నట్టుగా ఉండే ఆదిత్య ఓం కారణంగా నష్టం తప్ప లాభం లేదని బిగ్ బాస్ టీం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది.