https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సంచాలక్ గా ఫెయిల్ అయ్యినందుకు ఏడ్చేసిన నబీల్..నామినేట్ చేస్తామని బెదిరించిన కంటెస్టెంట్స్!

నబీల్ టీం సభ్యులు నువ్వు సంచాలక్ గా మన టీం కి అన్యాయం చేసావు, నామినేషన్స్ రానివ్వు నీ పని చెప్తా అని విష్ణు ప్రియ, నైనిక అంటారు. ఆ తర్వాత నబీల్ ఆదిత్య ఓం తో కూర్చొని ఇదే విషయం గురించి మాట్లాడుతూ బాధపడుతుంటాడు. 'ఫన్నీ యాంగిల్ లో పడి సంచాలక్ గా విఫలం అయ్యాను అని ఏడుస్తూ ఉంటాడు. అతని దగ్గరకు విష్ణు, సీత వచ్చి ఓదారుస్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 08:17 AM IST

    Bigg Boss Telugu 8(50)

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ రేస్ కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఏకైక కంటెస్టెంట్ నబీల్ మాత్రమే. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఎదో ఒక విషయం లో బలహీనంగా ఉన్నారు. ప్రారంభం లో నిఖిల్ టైటిల్ రేస్ లోకి వచేస్తాడని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. నిజానికి టాస్కులు వరకు చూస్తే నిఖిల్ టైటిల్ రేస్ కి అర్హుడే. కానీ ఇతని బలహీనత సోనియా. ఆమె ఏది చెప్తే అదే చేస్తాడు, హౌస్ లో భార్య భర్తలు లాగా ఉంటారు. ఆమె కారణం గా నిఖిల్ బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు. కానీ నబీల్ అలా కాదు. ఎలాంటి ఎమోషన్ వచ్చినా తనని తాను కంట్రోల్ చేసుకోగలడు, టాస్కులు అద్భుతంగా ఆడుతాడు, అలాగే స్నేహానికి టాస్కులకు మధ్య ఇతను పెట్టిన గీత మామూలుది కాదు.

    అసలు ఎక్కడా కూడా తనని విమర్శించేందుకు అవకాశం ఇవ్వడు నబీల్. అలాంటి నబీల్ నిన్న జరిగిన టాస్కులో సంచాలక్ గా విఫలం అవ్వడం తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, నబీల్ కూడా బాగా హర్ట్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రేషన్ కోసం బిగ్ బాస్ ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఒక టాస్కు పెడుతాడు. ఈ టాస్కులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొన్ని సౌండ్స్ వినిపిస్తాడు. ఆ సౌండ్స్ ని పర్ఫెక్ట్ గా పసిగట్టి పలక మీద ఆ సౌండ్ దేనిదో రాయాలి. ఈ టాస్కులో నబీల్ చేసిన చిన్న పొరపాటు కారణంగా నిఖిల్ టీం గెలుస్తుంది. చివరి రౌండ్ లో బిగ్ బాస్ చేసే సౌండ్స్ లో ముందుగా ఎక్కువగా ప్రేరణ కరెక్ట్ గా పెడుతుంది. కానీ నబీల్ చివర్లో వచ్చిన సౌండ్ ని పొరపాటున తన నోటితో చెప్పేస్తాడు. అప్పుడు నిఖిల్ వెంటనే తన స్లేట్ లో తప్పు పెట్టిన పదాన్ని తుడిపేసి నబీల్ చెప్పినట్టు కరెక్ట్ గా చెప్తాడు. ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ తుడిపి రాయకూడదు అని ప్రేరణ చెప్తూనే ఉంటుంది కానీ, నబీల్ అంతగా గమనించలేదు. చివరికి నిఖిల్ చెప్పినవే పెరిగినలోకి తీసుకొని శక్తి టీం ని విన్నర్ గా ప్రకటిస్తాడు నబీల్.

    దీంతో నబీల్ టీం సభ్యులు నువ్వు సంచాలక్ గా మన టీం కి అన్యాయం చేసావు, నామినేషన్స్ రానివ్వు నీ పని చెప్తా అని విష్ణు ప్రియ, నైనిక అంటారు. ఆ తర్వాత నబీల్ ఆదిత్య ఓం తో కూర్చొని ఇదే విషయం గురించి మాట్లాడుతూ బాధపడుతుంటాడు. ‘ఫన్నీ యాంగిల్ లో పడి సంచాలక్ గా విఫలం అయ్యాను అని ఏడుస్తూ ఉంటాడు. అతని దగ్గరకు విష్ణు, సీత వచ్చి ఓదారుస్తారు. అంతకు ముందు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసే టాస్క్ ఇస్తాడు. నబీల్ కి ఆదిత్య ఓం ని ఇమిటేట్ చేసే అవకాశం దొరుకుతుంది. అందరిలోకి ఈయన అద్భుతంగా చేయడంతో నబీల్ కి బిగ్ బాస్ ప్రత్యేకంగా అభినందలు తెలుపుతాడు.