https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ‘నీతో మాట్లాడేంత ఖాళీగా నేను లేను’ అంటూ గౌతమ్ ని వెళ్లేముందు కూడా అవమానించిన విష్ణు ప్రియ..ఇంత ద్వేషం ఎందుకు?

నిన్నటి ఎపిసోడ్ తో విష్ణు ప్రియ బిగ్ బాస్ ప్రయాణం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. 14 వారాలు ఈమె హౌస్ లో ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 09:26 AM IST

    Vishnu Priya

    Follow us on

    Bigg Boss Telugu 8 : నిన్నటి ఎపిసోడ్ తో విష్ణు ప్రియ బిగ్ బాస్ ప్రయాణం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. 14 వారాలు ఈమె హౌస్ లో ఉంది. ఈ 14 వారాలు ఆమె గొప్పగా ఆడిన టాస్కులు ఏవైనా ఉన్నాయా అని వెతికితే ఒక్కటి కూడా కనిపించదు. అంత గొప్పగా ఆమె టాస్కులు ఆడింది. కేవలం తన గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీని నచ్చే ఆడియన్స్ ఇన్ని రోజులు ఆమెని సేవ్ చేస్తూ వచ్చారు. అయితే విష్ణు ప్రియ కి మనసులో ఒకటి పెట్టుకొని, బయట మరోలా నటించడం అసలు చేత కాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఆమె ఒక వ్యక్తిని ఇష్టపడింది అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అదే ఒక వ్యక్తిని ద్వేషించినా ఆ ద్వేషం ప్రతీ సందర్భంలోనూ చూపిస్తూనే ఉంటుంది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఆమెకి తేజ, గౌతమ్ అసలు నచ్చలేదు. వాళ్ళతో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఇదే మైంటైన్ చేస్తూ వచ్చింది.

    నిన్న హౌస్ నుండి బయటకి వెళ్ళేటప్పుడు కూడా గౌతమ్ ని ఘోరంగా అవమానించి వెళ్తుంది. విష్ణు ప్రియ తో గౌతమ్ మాట్లాడుతూ ‘హౌస్ లో ఉన్నన్ని రోజులు మనం సరిగా మాట్లాడుకోలేదు. కానీ బయటకి వచ్చిన తర్వాత మాత్రం మంచిగా మాట్లాడుకుందాం’ అని అంటాడు. అప్పుడు విష్ణు ప్రియ దానికి సమాధానం చెప్తూ ‘ఎం అవసరం లేదు..నేను అంత ఖాళీగా లేను’ అని అంటుంది. దీనికి గౌతమ్ బదులిస్తూ ‘అంతే బయట నన్ను కలవవారా?, నేను ఇలాంటోడిని మీ చెల్లెలిని అడుగు చెప్తుంది’ అని అంటాడు. అలా హౌస్ లో నుండి బయటకి వెళ్తున్నప్పుడు గౌతమ్ ని అవమానించిన విష్ణు, స్టేజి మీదకు వెళ్లిన తర్వాత మరోసారి గౌతమ్ పై తనకు ఉన్న ద్వేషాన్ని మొత్తం బయటపెట్టింది. దీనిని చూసిన తర్వాత ఆడియన్స్ కి ఇంత ద్వేషం అవసరమా అని అనిపించక తప్పదు.

    ఆమె గౌతమ్ తో మాట్లాడుతూ ‘ఇలా అంటున్నందుకు నన్ను క్షమించు..ఇంటికి వెళ్లిన తర్వాత అర్జెంటుగా అసలు నువ్వేమి ఆడావో నేను చూడాలి. నిజంగా నాకు ఇప్పటికీ నీ ఆట తీరేంటో అర్థం కాలేదు’ అని అంటుంది. అంటే విష్ణు కి గౌతమ్ మెగా చీఫ్ అవ్వడం కనిపించలేదా?, ఈమె మెగా చీఫ్ అవ్వడానికి కారణం కూడా గౌతమ్ కదా?, ఇవన్నీ గేమ్స్ ఆడకుండా వచ్చిందని ఆమె అనుకుంటుందా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చిన ఒక వ్యక్తి జనాల ఓట్లతో ఇంత దూరం రావడం అనేది సీజన్ 1 తర్వాత సీజన్ 8 లోనే జరిగింది. అతనిలో ఎదో నచ్చబట్టే కదా ఆడియన్స్ ఇంత దూరం తీసుకొచ్చారు?, విష్ణు దానిని ఎందుకు గౌరవించడం లేదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.