Rajamouli and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదుగిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో కూడా టాప్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన త్రిబుల్ ఆర్ సినిమా వరకు సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ వచ్చాడు. వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకున్న ఏకైక దర్శకుడి గా కూడా రాజమౌళి పేరు ఇండస్ట్రీలో నిలవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. మరి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాతో మరోసారి ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికి మహేష్ బాబు తో సినిమా అనేసరికి మాత్రం రాజమౌళి ఎప్పుడు ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడనే రేంజ్ లో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ డైరెక్టర్ చేసిన ప్రతి సినిమాను కూడా సూపర్ సక్సెస్ గా నిలుపుతాడని అందరూ అనుకుంటున్నారు.
కానీ ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే విషయం మీదనే ఎవ్వరికి సరైన క్లారిటీ అయితే లేదు. మరి రాజమౌళి లాంటి దర్శకుడు సినిమాని స్టార్ట్ చేసే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఆ సినిమాకు సంబంధించిన కథ ఏంటి అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతూ ఉంటారు.
మరి దాని కోసమే ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఎప్పుడు తన ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడనే ధోరణిలోనే కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక మొత్తానికైతే తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని కొంతమంది చెబుతుంటే మరి కొంతమంది మాత్రం మహాశివరాత్రి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం రాజమౌళి మహేష్ బాబు ను దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు డేట్స్ ని కేటాయించే విధంగా ముందే మాట్లాడినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమా పాన్ వరల్డ్ లో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…