Sim Cards : ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. ప్రతి ఫోన్ లోనూ డ్యూయల్ సిమ్ కార్డులు ఉంటున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డ్యూయల్ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. దీనర్థం ప్రతి ఒక్కరికి రెండు ఫోన్ నంబర్లు ఉంటున్నాయన్న మాట. కొంతమంది వివిధ అవసరాల కోసం ఏకంగా మూడు, నాలుగు సిమ్ కార్డులను కూడా ఉపయోగిస్తారు. అవి కూడా వేరే వేరే నెట్వర్క్ లకు చెందినవి అయి ఉంటాయి. ఎందుకంటే ఒక సిమ్ కి సిగ్నల్ లేకపోయినా మరో సిమ్ నంబర్ కు ఫోన్ చేయవచ్చ. అయితే సిగ్నల్స్ సరిగా లేవని, రీఛార్జ్ ధరలు పెంచారని కొంతమంది తమ సిమ్ కార్డులకు రీఛార్జులను చేయడం మానేస్తున్నారు. రీఛార్జ్ చేయకుండా సిమ్ కార్డులను నిలిపివేస్తే ఆ నంబర్ ను టెలికాం సంస్థ తర్వాత వేరొకరికి కేటాయిస్తుంది. అప్పడు మీ దగ్గరున్న సిమ్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. అందుకే మీ ఫోన్ చేస్తే వేరే ఎవరో మాట్లాడుతున్నారని అప్పుడప్పుడు మనకు తెలిసిన వాళ్లు చెబుతుంటారు.
సిమ్ కార్డు ను ఎలా ఉపయోగించాలన్న విషయం ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. రెగ్యులర్ గా కాల్ చేసే నంబరుకు మాత్రం రీఛార్జ్ చేస్తుంటారు. మిగతా నంబర్ల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇన్ కమింగ్ కాల్స్ వస్తున్నాయి కదా అని అవుట్ గోయింగ్ సేవలు అవసరం లేదని రీఛార్జి చేయించడం మానేస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సిమ్ కార్డుకు బేసిక్ ప్లాన్ రీచార్జ్ చేయకపోతే 30 రోజుల తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్, డేటా సేవలు నిలిపివేస్తారు. ఈ నిర్ణయం ఆయా టెలికాం కంపెనీల ఆధారంగా ఉంటుంది. ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్-ఐడియా తదితర టెలికాం సంస్థలు సాధారణంగా నెల రోజుల తర్వాత అవుట్ గోయింగ్ సేవలు నిలిపివేస్తాయి. 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు రీచార్జ్ చేయకపోతే పూర్తిగా డి-యాక్టివేట్ అవుతుంది. మీ దగ్గర సిమ్ ఉన్న అది పనికి రాకుండా పోతుంది. అలాంటి ఖాళీ రేపర్ ఎక్కడన్నా పడితే.. అది వేరే వాళ్ల చేతుల్లోకి వెళితే ప్రమాదమా.. వాళ్లు ఆ సిమ్ కార్డు నుంచి మీ సమాచారాన్ని సేకరించ వచ్చా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
వాస్తవానికి, సిమ్ కార్డు మీ ఖాతా, మొబైల్ సేవ, ఇతర సమాచారం వంటి ప్రాథమిక సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ సబ్ స్క్రైబర్ల సమాచారం ఫోన్ నంబర్, ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. అలాగే, మీ సిమ్ ఏ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయబడిందో కూడా తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీ లొకేషన్‌ను తెలుసుకోవచ్చు.
సిమ్ కార్డ్‌లో ఎంత డేటా నిల్వ చేయబడింది?
సిమ్ కార్డులో చాలా తక్కువ సంఖ్యలో కాంటాక్ట్ నంబర్‌లను స్టోర్ చేసినప్పటికీ, మీ మొబైల్ ఎక్కడ ఉందో.. అది ఏ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయబడిందో కనుగొనడం చాలా సులభం, అయితే మీ సిమ్ లో ఇంతకంటే ఎక్కువ సమాచారం స్టోర్ చేయబడదు. ఫోటోలు, యాప్‌లు, ఫైల్‌లు, ఇతర మీడియా వంటి వ్యక్తిగత డేటా సిమ్ కార్డులో స్టోర్ కాదు. ఇది సాధారణంగా మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీలో లేదా మెమరీ కార్డ్‌లో నిల్వ చేయబడుతుంది. కానీ ఈ డేటా మీ సిమ్ కార్డులో స్టోర్ కాదు.
మీ మొబైల్ ఫోన్ పోతే…
ఒక వేళ మీ ఫోన్ పోయినట్లయితే, మీరు మీ సిమ్ కార్డ్‌ని సులభంగా భర్తీ చేయవచ్చు. మీ ఫోటోలు, ఇతర వ్యక్తిగత డేటాకు ఎటువంటి నష్టం ఉండదు, కానీ మీ సిమ్ చాలా తక్కువ సంఖ్యలో కాంటాక్ట్ నంబర్‌లను నిల్వ చేస్తుంది. ఈ సిమ్ ఎక్కువ కాంటాక్ట్ నంబర్‌లను స్టోర్ చేయదు. మీ ఫోన్ ఏ ఏరియాలో ఉందో మీ సిమ్ ద్వారా తెలుసుకోవడం చాలా సులభం. అలాగే, సంబంధిత మొబైల్ ఫోన్ ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిందో తెలుసుకోవచ్చు.