https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : పృథ్వీ కోసం టేస్టీ తేజ ని తోక్కేసిన విష్ణు ప్రియ..ఈమెని ఆడియన్స్ ఇంకెన్ని రోజులు భరించాలో!

ఈ సీజన్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో విష్ణు ప్రియ మీద ఆడియన్స్ లో మొదటి నుండి భారీ అంచనాలు ఉండేవి. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాస్కులు అద్భుతంగా ఆడగలదు అని అందరూ అనుకునేవారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 09:30 AM IST

    Bigg Boss Telugu 8: Vishnu Priya ditched Tasty Teja for Prithvi.

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో విష్ణు ప్రియ మీద ఆడియన్స్ లో మొదటి నుండి భారీ అంచనాలు ఉండేవి. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాస్కులు అద్భుతంగా ఆడగలదు అని అందరూ అనుకునేవారు. కానీ మూడవ వారంలోనే ఆమె గురించి అందరికీ అర్థం అయిపోయింది. పైన పటారం, లోన లొటారం క్యాటగిరీ కి చెందిన ఆమె ఈమె అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. అప్పట్లో ఈమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా భారీ ఓటింగ్ పడేది. కచ్చితంగా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న అమ్మాయిగా ఈమెని పరిగణించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈమె ఆట తీరుని చూసారో, ఈమెని అభిమానించే వాళ్ళు కూడా ఈమెను తిట్టడం మొదలు పెట్టారు. తన కోసం ఈమె గేమ్స్ ఆడిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. కానీ పృథ్వీ కోసం మాత్రం సీజన్ మొత్తం గేమ్స్ ఆడింది అనే చెప్పాలి. తనని ఎవరైనా తిట్టినా పెద్దగా పట్టించుకోదు కానీ, పృథ్వీ ని తిడితే మాత్రం శివంగి లాగా రెచ్చిపోతుంది.

    ఈమెని మార్చేందుకు చాలా మంది ప్రయత్నం చేసారు. ఫ్యామిలీ వీక్ లో ఆమె నాన్న వచ్చి చెప్పాడు, కానీ వినలేదు..నాకు అనిపించిందే చేస్తా అంటూ ముఖం మీదనే చెప్పేసింది. ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ లో ఈమె కోసం వచ్చిన యాంకర్ రవి, ఆమె చెల్లి కూడా చెప్పారు. కానీ ఈమె వాళ్ళతో వాదించింది, అనవసరంగా ఈమె కోసం వచ్చాను రా బాబు అని యాంకర్ రవి చిరాకు ముఖం పెడుతాడు. మొదటి నాలుగు వారాల్లో ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ సీజన్ చివరి దశకు వచ్చిన రోజుల్లో కూడా ఆమె ఇంకా పృథ్వీ కోసం గేమ్స్ ఆడితే చూసే ఆడియన్స్ కి ఎంత చిరాకుగా ఉంటుందో ఊహించుకోవచ్చు. తదుపరి వారం ఈమె నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఈమె పృథ్వీ ని నిజాయితీగా ప్రేమిస్తుందని అనుకున్నారు.

    కానీ నిన్న రోహిణి మాట్లాడుతూ ‘నువ్వే చెప్పావ్..ప్రారంభం లో నేను నిఖిల్ తో లవ్ ట్రాక్ నడపాలని అనుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదు, దీంతో పృథ్వీ ని లైన్ లో పెట్టాను’ అని విష్ణు ప్రియ ఒక ఎపిసోడ్ లో చెప్పినట్టు అనిపించింది. ఒకవేళ ఈ లవ్ ట్రాక్ మొత్తం కంటెంట్ కోసం నడిపి ఉంటే, విష్ణు ప్రియ బయటకి వచ్చిన తర్వాత మామూలు రేంజ్ లో నెగటివిటీ ని ఎదురుకోదు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి టాస్క్ లో విష్ణు ప్రియ ని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. పాపం టేస్టీ తేజ కస్టపడి తెడ్డు మీద నీళ్ల గ్లాసులను పట్టుకొని వెళ్తుంటే, ఎక్కడ పృథ్వీ కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తాయి అని, అతని తెడ్డుని చెరిపేస్తుంది. టేస్టీ తేజ ని అలాగే వదిలేసి ఉండుంటే టాప్ 2 లోకి వచ్చేవాడు. యష్మీ విషయంలో కూడా అదే చేసింది. ఇది చూసిన తర్వాత సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈమెకు టాస్కులు ఆడడం చేతకాదు, ఆడవాళ్లను ఆటని చూసి ఓర్చుకోలేదు అంటూ పోస్టులు వేస్తున్నారు.