https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడిన యష్మీ..వెన్నుపోటు పొడిచినా కూడా పృథ్వీ కే సపోర్టు!

ఫ్యామిలీ వీక్ పూర్తి అయిన తర్వాత యష్మీ లో మనం చాలా మార్పులు చూసాము. గ్రూప్స్ గేమ్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా, స్నేహితులకు ఒకలాగా, మిగతావాళ్లకు మరొకలాగా కాకుండా, తన సొంత గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 09:35 AM IST

    Bigg Boss Telugu 8: Yashmi played the group game again.

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఫ్యామిలీ వీక్ పూర్తి అయిన తర్వాత యష్మీ లో మనం చాలా మార్పులు చూసాము. గ్రూప్స్ గేమ్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా, స్నేహితులకు ఒకలాగా, మిగతావాళ్లకు మరొకలాగా కాకుండా, తన సొంత గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. పర్వాలేదు, ఈ అమ్మాయి ట్రాక్ లో పడింది, ఇక నుండి అయినా జాగ్రత్తగా ఆడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది కేవలం ఒక్క రౌండ్ కి మాత్రమే పరిమితం, ఆ తర్వాతి రౌండ్స్ లో ఆమె తన స్నేహితులకు మద్దతుగానే గేమ్స్ ఆడింది అనేది స్పష్టంగా ఆడియన్స్ కి అనిపించింది. టీ షర్ట్స్ ని కాపాడుకునే టాస్క్ లో ఈమె తన స్నేహితురాలు ప్రేరణ టీ షర్ట్ ని చింపేస్తుంది, పృథ్వీ టీ షర్ట్ ని చింపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎవ్వరిది వదలకుండా చేపడమే లక్ష్యంగా పెట్టుకొని గేమ్ ఆడింది. ఈమెలో కసిని చూసి నబీల్ కూడా సపోర్టు చేస్తాడు.

    కానీ రెండవ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ ఆమె తన స్నేహితుడు పృథ్వీ కి సపోర్ట్ చేయాలని చూసింది. రోప్స్ పట్టుకొని వేలాడే టాస్కులో పృథ్వీ ప్లాట్ ఫార్మ్ ని లాగేయగానే, యష్మీ నా వద్దకు వచ్చేయ్ అని గట్టిగా పిలుస్తుంది. ఆమె తల్చుకుంటే పృథ్వీ ని కూడా తోసేయొచ్చు, కానీ ఆ పని చేయలేదు. ఒకవేళ పృథ్వీ ని తోసి, తనకోసం మాత్రమే అలోచించి ఉండుంటే, ఆమె గ్రాఫ్ వేరే లెవెల్ లో ఉండేది, ఈ వారం డేంజర్ జోన్ లో ఉండేది కాదు. ఆటో టాస్క్ లో కూడా ఈమె చాలా వరస్ట్ అనిపించింది. మెగా చీఫ్ అవ్వని వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సాధారణమే. కానీ యష్మీ మాత్రం మెగా చీఫ్ అవ్వని రోహిణి, టేస్టీ తేజ లను తన శక్తి మొత్తం చూపించి బయటకి తోసే ప్రయత్నం చేసింది. ఈ టాస్క్ లో ఆమె పృథ్వీ, విష్ణు ప్రియా జోలికి పోలేదు.

    ఎవరికీ అయితే ఆమె అనుకూలంగా ఆడిందో, వాళ్ళే ఈమెకి చివరికి వెన్నుపోటు పొడిచారు. తేజ, రోహిణి ఆటో నుండి బయట పడ్డాక, ఇక కేవలం పృథ్వీ, యష్మీ, విష్ణు ప్రియ మిగులుతారు. పృథ్వీ, విష్ణు ప్రియ బలవంతంగా యష్మీ ని బయటకి తోస్తారు. అనవసరంగా నీకు సపోర్టు చేశా పృథ్వీ అని ఆ తర్వాత ఏడుస్తుంది యష్మీ. దీని తర్వాత అయినా ఆమె ఊరుకుందా,పృథ్వీ కి సపోర్టు చేయలేదా అంటే అది కూడా జరగలేదు. కుండా బ్యాలన్స్ టాస్క్ లో ఈమె రోహిణి కుండలో పృథ్వీ గెలవడం కోసమే ఇసుక పోస్తుంది. ఇక ఈమె సొంతంగా ఆడింది ఎక్కడ?, అనవసరంగా ప్రేరణ టీ షర్ట్ ని చింపి ఆమెని ఈ వారం మొత్తం గేమ్స్ ఆడనివ్వకుండా చేసింది అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళింది. యష్మీ కి తనని తాను నిరూపించుకునే అద్భుతమైన ఛాన్స్ వచ్చింది, అది సరిగ్గా ఉపయోగించుకొని ఉండుంటే ఆమె ఈ వారం సేవ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఈ వారం ఆమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.