Bigg Boss Telugu 8 : ఏ మనిషికైనా ఎన్నో అవమానాలను ఎదుర్కొని, కష్టపడి సొంత టాలెంట్ తో సాధించిన విజయం ఇచ్చే కిక్ మామూలు రేంజ్ లో ఉండదు. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో రోహిణి విషయంలో అదే జరిగింది. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో రోహిణి ని బాడీ షేమింగ్ చేసాడు. నువ్వు ఏ టాస్కులు ఆడలేవు, వేస్ట్ అని వెక్కిరించాడు. వంకరగా చూస్తూ మాట్లాడాడు. మరోపక్క ఆయన ప్రియురాలు విష్ణు ప్రియా రోహిణి ని జీరో అని నిన్నటి ఎపిసోడ్ లోనే అనింది. ఇన్ని అవమానాలను మనసులో పెట్టుకున్న రోహిణి , తన సత్తా చూపించి, ఎవరైతే తనని తక్కువ చేసి మాట్లాడారో, అతనినే ఓడించి శబాష్ అనిపించుకుంది. నిన్న ఈమె గెలుపుకి సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు గర్వపడ్డారు. ఆమె కాళ్ళు అసలు బాగాలేదు, యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళోలోను రాడ్స్ పెట్టారు.
కాసేపు నిలబడితేనే నరకప్రాయంగా ఉంటుంది, అలాంటిది ఏకంగా మూడు గంటల పాటు అంత బరువుని మోస్తూ నిల్చోవడం అనేది సాధారణమైన విషయం కాదు. గెలిచినా తర్వాత ఈమెలో వచ్చిన ఎమోషన్ ని చూసి ప్రతీ ఒక్కరు తమని తాము చూసుకున్నట్టు భావించారు, శత్రువులు కూడా మెచ్చుకునేలా ఆడిన రోహిణి ఆట తీరుని చూసిన తర్వాత, ఆమెకు టాప్ 5 లో స్థానం పదిలం అయ్యినట్టు అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగా చీఫ్ టాస్కు చివరి రౌండ్ లో టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ మిగులుతారు. ఈ రౌండ్ లో తెడ్డు మీద కుండ ఉంటుంది. ఆ కుండలో ఎవరికైతే ఈ ముగ్గురిలో ఒకరికి మెగా చీఫ్ అవ్వడం ఇష్టం ఉండదో, వాళ్ళ కుండలో ఇసుక పోయాలి. ఇసుక పోసిన కుండని క్రిందపడకుండా కాళ్లతో అదిమిపట్టుకొని బ్యాలన్స్ చేయాలి.
అలా ఎవరైతే చివరి వరకు క్రింద పడిపోకుండా బ్యాలన్స్ చేస్తారో, వాళ్ళు ఈ టాస్క్ లో గెలిచి బిగ్ బాస్ సీజన్ 8 చివరి మెగా చీఫ్ గా నిలుస్తారు. ఈ టాస్క్ మనకి టెలికాస్ట్ లో కేవలం పది నిమిషాలు చూపించారు. కానీ నిజానికి 3 గంటలకు పైగా ఈ టాస్కు కొనసాగింది. ఓడిపోయాడు కదా అని పృథ్వీ ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అతను కూడా అద్భుతంగా ఆడాడు. అతనికి బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా మూడు గంటలు మ్యానేజ్ చేసి చూపించాడు. ఓడిపోయిన తర్వాత అతను ఏడ్చింది ఓడిపోయినందుకు కాదు,ఎవరిని అయితే చిన్న చూపు చూశాడో, ఆమె చేతిలో ఓడిపోయినందుకు. అందుకే ఒక మనిషిని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు, తక్కువ అంచనా అసలు వేయకూడదు, ఖర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు అనే విషయానికి నిన్నటి ఎపిసోడ్ ఒక ఉదాహరణ.