https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ‘సోలో బాయ్’ కాదు ‘సొల్లు బాయ్’ అంటూ గౌతమ్ పై నోరు జారిన విష్ణు ప్రియ..ఇంత చేసినా విష్ణు కి సపోర్ట్ చేసిన గౌతమ్!

ఒక బిగ్ బాస్ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 2 రేస్ లోకి రావడం అనేది చిన్న విషయమైతే కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 08:52 AM IST

    Solo Boy

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఒక బిగ్ బాస్ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 2 రేస్ లోకి రావడం అనేది చిన్న విషయమైతే కాదు. ఇప్పటి వరకు ఇలాంటిది ఏ సీజన్ లో కూడా జరగలేదు. కేవలం ఈ ఒక్క సీజన్ లో గౌతమ్ విషయంలో మాత్రమే జరిగింది. సీజన్ 1 లో నవదీప్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ 4 వరకు వచ్చాడు. ఆ తర్వాత అర్జున్ అంబటి టాప్ 6 వరకు వచ్చాడు. వీళ్లిద్దరి తర్వాత ఇప్పుడు గౌతమ్ ఏకంగా టైటిల్ విన్నింగ్ రేస్ లోకి వచ్చాడు. ఇలాంటి రేర్ రికార్డుని మళ్ళీ ఏ సీజన్ లో కూడా వేరే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ రిపీట్ చెయ్యలేరేమో. అంత అద్భుతంగా ఆడాడు గౌతమ్. గౌతమ్ ఎదుగుదల ని చూసి ఇంట్లో ప్రతీ ఒక్కరికి కుళ్ళే, ఒక్క అవినాష్, రోహిణి కి తప్ప.

    ముఖ్యంగా నిఖిల్ ఒకప్పుడు గౌతమ్ పేరు చెప్తే రగిలిపోయేవాడు. ఆ తర్వాత ఈ విషయాన్నీ జనాలు గమనిస్తున్నారు అని విషయాన్ని గ్రహించిన నిఖిల్ గౌతమ్ తో కాస్త సాఫ్ట్ గా ఉండడం నేర్చుకున్నాడు. కానీ ఎంత అణిచిపెట్టుకున్నా గౌతమ్ మీద పగ అతనికి తగ్గలేదని ఈ వారం నామినేషన్స్ సమయంలో బయటపడింది. ఇక నిఖిల్ తర్వాత హౌస్ లో గౌతమ్ పేరు చెప్తే ఆవేశంతో రగిలిపోయే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రేరణ, విష్ణు ప్రియ. వీళ్ళిద్దరూ కూడా గౌతమ్ పై అవకాశం వచ్చినప్పుడల్లా అసూయ ని చూపిస్తూ ఉంటారు. నిన్న విష్ణు ప్రియ గౌతమ్ ని ‘సోలో బాయ్’ కాదు పెద్ద ‘సొల్లు బాయ్’ అంటూ మాట్లాడిన మాటలు చూసేవాళ్లకు చాలా చిరాకుగా అనిపించింది. విష్ణు ప్రియ లాంటి అమ్మాయి నుండి ఇలాంటివి ఆశించలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే మొన్న బిగ్ బాస్ హౌస్ లోకి వరల్డ్ బెస్ట్ చెఫ్స్ లో ఒకరైన సంజయ్ తుమ్మల వచ్చి కంటెస్టెంట్స్ అందరికీ రుచికరమైన వంటకాలను వండించి, వాళ్ళతో కాసేపు సరదాగా గడిపి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ తో మాట్లాడుతూ బయట అతని గురించి వచ్చే పాజిటివ్ తో పాటుగా నెగటివ్ ట్రోల్ల్స్ గురించి కూడా చెప్తాడు. ప్రతీసారి సోలో బాయ్ అని చెప్పుకుంటూ ఉండకు, కొంతమంది బయట సొల్లు బాయ్ అని కామెంట్స్ చేస్తున్నారు అని అంటాడు. దీనికి విష్ణు ప్రియ స్పందిస్తూ సంజయ్ గారు చాలా ధైర్యం గా బయట అనుకునేవి చెప్పేసాడు. గౌతమ్ విషయంలో నాకు చాలాసార్లు అలా అనిపించింది. అతను నిజంగా సొల్లు బాయ్ నే, పోనీలే కొంతమంది జనాలు అయినా దీనిని గుర్తించారు అని నిఖిల్ తో చెప్పుకుంటుంది. ఇంత మాట్లాడిన ఈమెకు గౌతమ్ రోహిణి ని కూడా పక్కన పెట్టి విష్ణు ప్రియ కి ఓటుని అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తాడు. ఇది ఆయన మనస్తత్వం ఎంత గొప్పదో తెలియచేస్తుంది.