https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పులిలా ఆడిన గౌతమ్..ఈ ఎపిసోడ్ తో వేరే లెవెల్ కి చేరుకున్న ఓటింగ్..రోహిణి కోసం అవినాష్ గొప్ప త్యాగం!

మొదటి రౌండ్ లో కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా జెండా మీద పడిపోతారు. గౌతమ్ చేతికి ఆ జెండా వస్తుంది. నిఖిల్, నబీల్, ప్రేరణ, రోహిణి, అవినాష్, విష్ణు ప్రియ ఇలా ప్రతీ ఒక్కరు గౌతమ్ చేతుల్లో నుండి ఆ జెండాని లాగేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కరు కూడా లాగలేకపోతారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 08:49 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నబీల్, విష్ణు ప్రియా, ప్రేరణ ఓటుని అప్పీల్ చేసుకోగా, గౌతమ్ , నిఖిల్, అవినాష్, రోహిణి వంటి వారు మిగిలి ఉన్నారు. నిన్న విష్ణు ప్రియ ఓటుని అప్పీల్ చేసుకునే ముందు జరిగిన టాస్క్ చూసేందుకు చాలా అద్భుతంగా అనిపించింది. చాలా కాలం తర్వాత హౌస్ లో దమ్మున్న టాస్క్ పడింది అని ప్రేక్షకులకు అనిపించింది. ఈ టాస్క్ పేరు ‘పవర్ ఫ్లాగ్’. ఒక్క పెద్ద రౌండ్ సర్కిల్ లో ఎర్ర జెండా ఉంటుంది. బజర్ సౌండ్ రాగానే కంటెస్టెంట్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ జెండా ని పట్టుకోవాలి. ఏ కంటెస్టెంట్ అయితే పట్టుకున్న జెండాని వదలకుండా, బజర్ మోగే వరకు ఉంటాడో ఆ కంటెస్టెంట్ విన్నర్ అవుతాడు. ఈ టాస్క్ లో గౌతమ్ తన విశ్వరూపం చూపించాడు.

    మొదటి రౌండ్ లో కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా జెండా మీద పడిపోతారు. గౌతమ్ చేతికి ఆ జెండా వస్తుంది. నిఖిల్, నబీల్, ప్రేరణ, రోహిణి, అవినాష్, విష్ణు ప్రియ ఇలా ప్రతీ ఒక్కరు గౌతమ్ చేతుల్లో నుండి ఆ జెండాని లాగేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కరు కూడా లాగలేకపోతారు. ఇది నిజంగా అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇంత సత్తా ఒక మనిషిలో ఎలా ఉంది అని ఆశ్చర్యపోతారు. అలా ఆయన మూడు రౌండ్లు నాన్ స్టాప్ గా గెలుస్తాడు. మొదటి రౌండ్ లో నబీల్ ని తీసేస్తాడు, రెండవ రౌండ్ లో ప్రేరణ ని తీస్తాడు, మూడవ రౌండ్ లో నిఖిల్ ని తీస్తాడు. నాల్గవ రౌండ్ లో కూడా గౌతమ్ గెలిచేవాడు కానీ, తృటిలో అతని చేతి నుండి జెండా జారీ రోహిణి కి వెళ్ళిపోతుంది. లేకపోతే ఈ రౌండ్ కూడా గౌతమ్ దే.

    ఇక తర్వాత రౌండ్ లో అవినాష్ చేతికి జెండా వస్తుంది. విష్ణు ప్రియ, రోహిణి అతని చేతి నుండి లాగేందుకు చాలా ప్రయత్నం చేస్తారు కానీ, అది వాళ్ళ వల్ల కాదు. ఈ రౌండ్ లో గెలిచిన అవినాష్ విష్ణు ప్రియ ని గేమ్ నుండి తప్పిస్తాడు. రెండవ రౌండ్ లో అవినాష్ రోహిణి కోసం జెండా ని వదిలేస్తాడు. తన కోసం త్యాగం చేసినందుకు అవినాష్ ని చూసి రోహిణి ఏడ్చేస్తుంది. నేను ఎలాగో సేఫ్ గా ఫినాలే కి వెళ్ళిపోయాను, నా స్నేహితురాలు ఇంకా నామినేషన్స్ లో ఉంది, ఆమెకి ఓటు అప్పీల్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే నేను వదిలేసాను అని అంటాడు అవినాష్. చివరి వారం లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అవినాష్ తన స్నేహితులు గురించి ఆలోచిస్తున్నదంటే అతని మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. నిజంగా అవినాష్ లాగా ఎవ్వరూ చేయలేరంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పొగుడుతున్నారు.