https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : సంచాలక్ గా రోహిణి ఫెయిల్..నిఖిల్ కి తీరని అన్యాయం..అవినాష్ తో కలిసి గ్రూప్ గేమ్స్!

నామినేషన్స్ లో ఉన్న రోహిణి ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టాలంటే ఈ వారం ఆమె కచ్చితంగా ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అవ్వాలి.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 08:58 AM IST

    Rohini

    Follow us on

    Bigg Boss Telugu 8 : నామినేషన్స్ లో ఉన్న రోహిణి ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టాలంటే ఈ వారం ఆమె కచ్చితంగా ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అవ్వాలి. కానీ ఆమె సేవ్ అయ్యే రేంజ్ లో భయంకరమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇప్పటి వరకు పడలేదు. ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులు బాగానే ఆడుతుంది కానీ, ఎక్కువగా హైలైట్ అవ్వడం లేదు. ఇలాంటి సమయంలో ఆమెకి నెగటివ్ ఎపిసోడ్స్ అసలు పడకూడదు. కానీ నిన్న ఆమెకు నెగటివ్ ఎపిసోడ్ పడింది. సంచాలక్ గా ఆమె డిజాస్టర్ అయ్యింది. టాస్కుని అర్థం చేసుకోకుండా ఇలా ఆమె నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే ‘ఓట్ ఫర్ అప్పీల్’ చేసుకోవడానికి ఇష్టం లేని కంటెస్టెంట్స్ ఫోటోలను ఎంచుకొని దూరంగా అమర్చబడి ఉన్నటువంటి స్టాండ్ చివర్లో ఫోటోని నిలబెట్టాలి. ఆ తర్వాత బ్రిక్స్ ని చివరి నుండి ఫోటో ముందు వరకు అమర్చి, ఒక్క బ్రిక్ ని ముందుకు తోస్తే , మిగిలినవన్నీ క్రింద పడుతూ, చివర్లో ఉన్న కంటెస్టెంట్ ఫోటో డస్ట్ బిన్ లో పడిపోతుంది.

    అలా డస్ట్ బిన్ లో పడిపోయిన కంటెస్టెంట్స్ కి ఓట్ ని అప్పీల్ చేసుకోవడానికి వీలు లేదు. ఎవరి ఫోటో అయితే డస్ట్ బిన్ లో పడిపోకుండా ఉంటుందో, వాళ్ళు ‘ఓట్ ఫర్ అప్పీల్’ కంటెస్టెంట్ గా నిలుస్తారు అన్నమాట. న్యాయంగా అయితే అయితే ఈ టాస్కులో నిఖిల్ గెలవాలి,, కానీ రోహిణి సరైన నిర్ణయం తీసుకోకుండా విష్ణు ప్రియ ని ఎంచుకుంటుంది. రూల్స్ ప్రకారం అయితే నబీల్ ఫోటో డస్ట్ బిన్ లో పడదు, అతనికి ఓటు ని అప్పీల్ చేసుకునే అవకాశం అయినా ఇవ్వాలి. అలా కాకుండా రూల్స్ ని అనుసరించకుండా అడ్డదిడ్డంగా బ్రిక్స్ పెట్టి నిఖిల్ ఫోటో ని డస్ట్ బిన్ లో పడిపోయేలా చేస్తుంది విష్ణు ప్రియ. ఇక్కడ నిఖిల్ కి అన్యాయం చేస్తూ విష్ణు ప్రియ ని ఈ టాస్క్ లో గెలిచినట్టుగా ప్రకటిస్తుంది రోహిణి.

    ఇది రోహిణి ని అభిమానించే వారికి కూడా షాక్ కి గురి అయ్యేలా చేస్తుంది. పైగా ఈమె చివరి వారం లోకి వచ్చేసింది అనే ధైర్యం తో అవినాష్ తో కలిసి గ్రూప్ గేమ్స్ చాలా ఓపెన్ గా ఆడేస్తుంది. ఇది ఆడియన్స్ గమనిస్తున్నారు అనే విషయం కూడా మర్చిపోయింది. ఏది ఏమైనా రోహిణి ఈ వారం అనుకున్నంతగా హైలైట్ అవ్వలేదు. టాప్ 3 లో ఈమె కచ్చితంగా ఉంటుంది, ఈమెకు మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య ఓటింగ్ తేడా చాలా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈమె కూడా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ కి సమానమైన ఓటింగ్ తో కొనసాగుతుంది. కచ్చితంగా ఈమె డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సేవ్ అయితే అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఓటింగ్స్ పరంగా అయితే విష్ణు ప్రియ డేంజర్ జోన్ లో ఉంది.