https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పృథ్వీ కి ఇష్టమైన హౌస్ మేట్స్ వీళ్ళే..సోనియా ని మర్చిపోలేకపోతున్న నిఖిల్..వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన విష్ణు ప్రియ!

యష్మీ కూడా పృథ్వీ కి బాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈమె కూడా పృథ్వీ తో త్వరలో ఒక లవ్ ట్రాక్ నడిపే ఆలోచనలో ఉంది అనే విషయం అందరికీ అర్థం అవుతుంది. అయితే యష్మీ గత వారంలో విష్ణు ప్రియ కి దూరంగా ఉండడం నేర్చుకో అని పృథ్వీ కి చెప్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 09:56 AM IST

    Bigg Boss Telugu 8(79)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ కి రెమో గా పిలవబడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది పృథ్వీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరూ ఇతని కోసం పడి చస్తున్నారు. ముఖ్యంగా విష్ణు ప్రియ మొదటి వారం నుండి ఈయన వెంట తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. విష్ణు ప్రియ తన గేమ్ ని మొత్తం చెడగొట్టుకొని, 24 గంటలు హౌస్ లో పృథ్వీ చుట్టూ తిరుగుతుందని ఆమె అభిమానులకు సైతం అనిపించింది. ఆమె నుండి ఎలాంటి గేమ్ లేకపోవడంతో ఆరంభం లో ఉన్నటువంటి ఓటింగ్ ఇప్పుడు లేదు. ప్రతీ వారం ఆమె గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఈ వారం అయితే ఆమె ఏకంగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇదంతా పృథ్వీ మాయలో పడడం వల్లనే అని విష్ణు ప్రియ అభిమానులు సోషల్ మీడియా లో అంటున్నారు.

    ఇదంతా పక్కన పెడితే మరోపక్క యష్మీ కూడా పృథ్వీ కి బాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈమె కూడా పృథ్వీ తో త్వరలో ఒక లవ్ ట్రాక్ నడిపే ఆలోచనలో ఉంది అనే విషయం అందరికీ అర్థం అవుతుంది. అయితే యష్మీ గత వారంలో విష్ణు ప్రియ కి దూరంగా ఉండడం నేర్చుకో అని పృథ్వీ కి చెప్తుంది. అప్పటి నుండి పృథ్వీ విష్ణు ప్రియ కి దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. అతను ఎంత దూరం పెట్టినప్పటికీ కూడా విష్ణు ప్రియ అతని చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో పృథ్వీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కి విష్ణు ప్రియకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఇంటి నుండి పంపిన వంటకాలను ఇతర కంటెస్టెంట్స్ చేత ఇప్పించే టాస్కు ని పెట్టాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పృథ్వీ ని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు.

    ముందుగా బిగ్ బాస్ అతనితో మాట్లాడుతూ ‘హౌస్ లో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు’ అని అడుగుతాడు. అప్పుడు పృథ్వీ నిమిషం కూడా ఆలోచించకుండా నిఖిల్, యష్మీ పేర్లు చెప్పేస్తాడు. అప్పుడు బిగ్ బాస్ ‘బాగా ఆలోచించుకో..ఎవరినైనా మర్చిపోయావేమో’ అని అంటాడు. అప్పుడు పృథ్వీ బలవంతంగా విష్ణు ప్రియ పేరు చెప్తాడు. ఇవన్నీ బయట LED టీవీ లో చూస్తున్న విష్ణు ప్రియ మొదట్లో కామెడీ గానే చూసింది కానీ, పృథ్వీ బయటకి వచ్చిన తర్వాత వెక్కిళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. దీని అర్థం ఆమెని పృథ్వీ దూరం పెడుతున్నట్టుగా అర్థం అయ్యేలా చెప్పాడు. మరి విష్ణు ప్రియ అది అర్థం చేసుకొని ఇప్పటికైనా పృథ్వీ కి దూరం గా ఉండడం నేర్చుకుంటుందా?, లేదా మళ్ళీ అతని వెంట తిరుగుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఇప్పటికీ అతని వెంటనే తిరిగితే మాత్రం ఈమె డేంజర్ జోన్ కి మరింత చేరువ అయ్యినట్టే అనుకోవాలి.