https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నన్ను ఎలిమినేట్ చేయండి..నేను ఉండలేను, ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుస్తూ నాగార్జునని బ్రతిమిలాడిన మణికంఠ!

పోనీ అతని బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పినవి మొత్తం నిజమా అంటే, అది కూడా కాదు. తండ్రి దూరం పెట్టాడు అని చెప్పుకొచ్చాడు, అలాంటిదేమి లేదు, అతనే దూరం గా వెళ్ళాడు అని ఆయన చెల్లెలు చెప్పింది. భార్య నన్ను వదిలేసింది అంటూ ఆమెని విలన్ ని చేసాడు, కానీ ఆమె తన చేతులతో చేసిన వంట ని నిన్న మణికంఠ కి పంపించింది, అంతే కాదు అతనికి ప్రేమతో మెసేజ్ కూడా చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 10:06 AM IST

    Bigg Boss Telugu 8(80)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో సింపతీ స్టార్ గా ఆడియన్స్ లో గుర్తింపు పొందిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ మాత్రమే. గత సీజన్స్ లో కూడా సానుభూతి కోణం లో గేమ్ ఆడిన కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ, నాగ మణికంఠ స్థాయిలో సానుభూతి ప్రయత్నం చేసిన కంటెస్టెంట్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లో ప్రతీ దానికి గొడవ పడడం, నమ్మిన వాళ్ళను వెన్నుపోటు పొడవడం, అమ్మాయిలను మాటికొస్తే హగ్ చేసుకోవడం,ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు ఎక్కడి నుండి ఇతన్ని పట్టుకొచ్చారు బాబు అని హౌస్ లో కంటెస్టెంట్స్ అనుకుంటున్నారు. పాపం హౌస్ లో ఉన్న వాళ్లకు నాగ మణికంఠ ఎమోషనల్ గా ప్రతీ రోజు నరకం చూపిస్తున్నాడు అనే చెప్పాలి.

    పోనీ అతని బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పినవి మొత్తం నిజమా అంటే, అది కూడా కాదు. తండ్రి దూరం పెట్టాడు అని చెప్పుకొచ్చాడు, అలాంటిదేమి లేదు, అతనే దూరం గా వెళ్ళాడు అని ఆయన చెల్లెలు చెప్పింది. భార్య నన్ను వదిలేసింది అంటూ ఆమెని విలన్ ని చేసాడు, కానీ ఆమె తన చేతులతో చేసిన వంట ని నిన్న మణికంఠ కి పంపించింది, అంతే కాదు అతనికి ప్రేమతో మెసేజ్ కూడా చేసింది. కోట్లాది మంది చూసే షో లో బిగ్ బాస్ గెలిస్తేనే నా భార్య నన్ను దగ్గరకు తీస్తుంది అని చెప్పాడంటే ఇతని గేమ్ ప్లాన్ ఏంటో జనాలకు అర్థం కాలేదా?, ఇంకా ఇతనికి ఎలా ఓట్లు వేస్తున్నారు అనే సందేహం ఆడియన్స్ లో ఉంది, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా ఉంది. ఈ సందేహం నేటి ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున కి కూడా వచ్చింది. అందుకే ఆయన నేడు మణికంఠ పై బాగా ఫైర్ అయ్యినట్టు తెలుస్తుంది. మణికంఠ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, ఎంత ఏడుస్తావో ఇప్పుడే ఏడ్చేయ్, ఇక హౌస్ లో నీ సింపతీ డ్రామాలు చోటు లేదు అని అన్నాడట.

    దీనికి మణికంఠ బాగా ఏడ్చి నేను హౌస్ నుండి వెళ్ళిపోతాను సార్, నన్ను ఎలిమినేట్ చేయండి అని బ్రతిమిలాడాడట, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే మణికంఠ ఏడ్చింది నాగార్జున తిట్టినందుకా?, లేకపోతే హౌస్ లో అతని భార్య పంపిన మెసేజ్ ని చూపించడం వల్ల అలాంటి మాటలు మాట్లాడాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నేటి ఎపిసోడ్ మణికంఠ కి పెద్ద ప్లస్ కాబోతుంది అని చెప్పొచ్చు, ఆడియన్స్ లో అతని పై సానుభూతి కోణం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. నాగార్జున ఇచ్చిన ఈ కోటింగ్ తర్వాత అయినా మణికంఠ మారుతాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.