https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నీకు పెళ్లి కాకుంటే నేనే నిన్నుపెళ్లి చేసుకునేదానిని అంటూ మణికంఠ పై మనసులో మాట చెప్పిన యష్మీ!

నిన్ను హౌస్ నుండి బయటకి పంపే వరకు నేను ప్రతీ వారం నామినేట్ చేస్తూనే ఉంటాను అని శపధం కూడా చేసింది. చెప్పినట్టుగానే చేస్తుంది కూడా, అయినప్పటికీ ఆమె మణికంఠ పై అప్పుడప్పుడు ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తుంది. అతను ఏడుస్తున్నప్పుడు దగ్గరకు వెళ్లి ఓదార్చడం వంటివి చేస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 09:35 AM IST

    Bigg Boss Telugu 8(78)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ప్రవర్తన ఆడియన్స్ కి ఏమాత్రం అర్థం కావడం లేదు. అలాంటి కంటెస్టెంట్స్ లో యష్మీ ఒకరు. ఈమె తత్త్వం నిజంగానే బోల్డ్ గా ఉంటుందా?, లేదా బోల్డ్ గా ఉన్నట్టు నటిస్తుందా అనేది ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. మణికంఠ తో ఈమె ప్రారంభం లో స్నేహం చేసింది, ఆ తర్వాత అతను స్నేహం పేరుతో వెన్నుపోటు పొడుస్తూ నామినేట్ చేసాడని అతని పై పీకల దాకా కోపం పెంచేసుకుంది. నిన్ను హౌస్ నుండి బయటకి పంపే వరకు నేను ప్రతీ వారం నామినేట్ చేస్తూనే ఉంటాను అని శపధం కూడా చేసింది. చెప్పినట్టుగానే చేస్తుంది కూడా, అయినప్పటికీ ఆమె మణికంఠ పై అప్పుడప్పుడు ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తుంది. అతను ఏడుస్తున్నప్పుడు దగ్గరకు వెళ్లి ఓదార్చడం వంటివి చేస్తుంది.

    అతనికి హౌస్ లో అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తుంది, కానీ నామినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం తన దగ్గర పాయింట్స్ లేకపోయినా నామినేట్ చేసేస్తుంది. మణికంఠ పక్కన లేని సమయం లో ‘వీడు ఎలిమినేట్ అవ్వాలి అబ్బా..చాలా డేంజరస్, ఫేక్ కంటెస్టెంట్ ఇతను. ఆడియన్స్ ఇతనికి ఓట్లు ఎలా వేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు’ అంటూ ఈ వారం ప్రారంభం లో వాష్ రూమ్ వద్ద ప్రేరణతో మాట్లాడిన మాటలు తెగ వైరల్ గా మారాయి. అదంతా పక్కన పెడితే నిన్న మణికంఠ ని జ్యోతిష్యుడిగా కూర్చోబెట్టి కంటెస్టెంట్స్ అందరికీ అతని చేత జాతకం చెప్పించే టాస్కు ని ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్కు చాలా సరదాగా ముగుస్తుంది. ఆ తర్వాత మణికంఠ జాతకాన్ని హౌస్ మేట్స్ అందరూ చెప్పమని అంటాడు బిగ్ బాస్. అప్పుడు యష్మీ అతని జాతకం చెప్పేందుకు ముందుకు వస్తుంది.

    ఆమె మాట్లాడుతూ ‘ఎదో స్పేస్ అని పక్కకి వెళ్తుంటావు కానీ, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆడియన్స్ చేత ప్రతీ నామినేషన్ లో సేఫ్ అవుతున్నావు. దానిని అలాగే కొనసాగించు. కానీ నాకు మాత్రం పిచ్చి ఎక్కించకు అయ్యా. బిగ్ బాస్ ఎప్పుడు ట్విస్ట్ ఇచ్చినా నాకేమి అర్థం కావడం లేదు, నాకు ఒక అవకాశం ఇస్తారా అని ఏడవడం లాంటివి పక్కన పెట్టి, నీకు ఏది అనిపిస్తాడో అది చెప్పు. ఎప్పుడూ నవ్వుతూ ఉండు, ప్లీజ్, నువ్వు నవ్వితే చాలా బాగుంటాది, ముందు నీ నవ్వుని చూసే నేను పడిపోయాను. తర్వాత నీకు పెళ్లి అయ్యింది, పాప కూడా ఉందని తెలిసింది, అందుకే సైలెంట్ అయిపోయాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండు, ఆల్ ది బెస్ట్’ అని చెప్తుంది. ఆమె మాట్లాడిన ఈ మాటలను చూసి హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. మణికంఠ లేనప్పుడు అతని గురించి ఎంతో చెత్తగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అతని మీద పగ ఉన్నట్టు చూపించింది. కానీ అతనితో స్నేహంగా ఉన్నట్టుగా కూడా ఆడియన్స్ కి చూపిస్తుంది, అంటే మణికంఠ కి టాప్ ఓటింగ్ ఉంది, ఇక అతన్ని టార్గెట్ చెయ్యకూడదు అనే విషయం యష్మీ కి అర్థమైందా?, అందుకే ఇలా చేస్తుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.