https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టేస్టీ తేజ తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చేసిన హౌస్ మేట్స్..ఒక వ్యక్తి మీద ఇంత ద్వేషమా!

సీజన్ మొత్తం ఇలాంటి అన్యాయపూరితమైన నిర్ణయాలు, నాగార్జున పరమ చెత్త హోస్టింగ్ కారణంగానే ఈ సీజన్ డిజాస్టర్ కా బాప్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే టేస్టీ తేజ హౌస్ లోకి అడుగుపెట్టిన ఉద్దేశ్యం ఏమిటో అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 07:57 AM IST

    Bigg Boss Telugu 8(209)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత సీజన్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే అందించాడు. అందుకు ఆయన్ని ప్రేక్షకులు 9 వారాలు ఉంచారు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆయన వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పటికీ అటు ఎంటర్టైన్మెంట్ అందించడంలోనూ, ఇటు గేమ్స్ ఆడడంలోనూ తన వైపు నుండి ది బెస్ట్ ఇచ్చేస్తున్నాడు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం కి టేస్టీ తేజ అంటే కచ్చితంగా చిన్న చూపే, అందులో ఎలాంటి సందేహం లేదు. అతని ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చే టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రం కావాలి, కానీ తేజకి మాత్రం ప్రత్యేకమైన శిక్షలు కావాలి. అతను చేసే తప్పులు వేరే కంటెస్టెంట్స్ చేస్తే కనీసం తప్పు చేసావు అని కూడా చెప్పరు, తేజ తప్పు చేస్తే మాత్రం వచ్చే వారం ఏకంగా మెగా చీఫ్ టాస్కుల నుండి తొలగిస్తారు. నిఖిల్, పృథ్వీలు గేమ్స్ బాగా ఆడితే సింహం, పులి అంటారు, వాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడిన టేస్టీ తేజని మాత్రం గుర్తించరు.

    సీజన్ మొత్తం ఇలాంటి అన్యాయపూరితమైన నిర్ణయాలు, నాగార్జున పరమ చెత్త హోస్టింగ్ కారణంగానే ఈ సీజన్ డిజాస్టర్ కా బాప్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే టేస్టీ తేజ హౌస్ లోకి అడుగుపెట్టిన ఉద్దేశ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. తన తల్లిని బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ వీక్ లోకి తీసుకొచ్చి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చూపించడం. కానీ ఈ సీజన్ లో టేస్టీ తేజ కి ఆ అవకాశమే లేకుండా చేసారు నాగార్జున, పృథ్వీ, నిఖిల్, విష్ణు ప్రియా. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్క కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ లో ఆట పరంగా, ప్రవర్తన పరంగా పరమ చెత్త కంటెస్టెంట్ ఎవరు అని అడుగుతాడు నాగార్జున. దీంట్లో తేజకి అత్యధిక ఓట్లు రావడంతో అతను వరస్ట్ కంటెస్టెంట్ గా ఎంపిక కాబడ్డాడు. వరస్ట్ కంటెస్టెంట్ అయ్యినందుకు హౌస్ లోకి అతని కుటుంబం ఫ్యామిలీ వీక్ లో రావడానికి వీలు లేదట.

    అసలు ఇదేమి పనికిమాలిన నిర్ణయమో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే హౌస్ లో 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో 10 మంది తేజకి వ్యతిరేకంగా ఉంటే వరస్ట్ కంటెస్టెంట్ గా పరిగణించి అతనికి శిక్ష వేయొచ్చు. కానీ హౌస్ లో తేజ కి పడిన ఓట్లు కేవలం మూడు మాత్రమే. అవి నిఖిల్, పృథ్వీ, విష్ణు ప్రియ వేశారు. రెండు ఓట్లు పడిన కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. రెండు కి మూడుకి మధ్య ఏమి తేడా ఉందని తేజ ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టే శిక్ష విధించారు?, మరీ ఇంత అన్యాయమా. హౌస్ లో నభీల్, అవినాష్, ప్రేరణ, రోహిణి తప్ప మిగిలిన అందరికీ టేస్టీ తేజ అంటే పగ ఉంది. ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వేసి బయటకి పంపేద్దామా అని ఉన్నారు. అయితే తన మనసు గాయపడి నిర్ణయాన్ని నాగార్జున తీసుకున్నప్పటికీ, టేస్టీ తేజ మిగిలిన కంటెస్టెంట్స్ లాగ డ్రామా చేయలేదు. బాధపడ్డాడు కానీ, చివరికి నాగార్జున నిర్ణయాన్ని గౌరవించి తల దించేసుకున్నాడు. ఒక విధంగా తేజ కి ఇది పాజిటివ్ ఎపిసోడ్ అనే చెప్పాలి, వచ్చే వారం కచ్చితంగా ఆయన నామినేషన్స్ లోకి వస్తే టాప్ 1 లో ఉంటాడు.